కాళోజీ.. ధిక్కారస్వరం | - | Sakshi
Sakshi News home page

కాళోజీ.. ధిక్కారస్వరం

Sep 9 2025 6:43 AM | Updated on Sep 9 2025 6:43 AM

కాళోజీ.. ధిక్కారస్వరం

కాళోజీ.. ధిక్కారస్వరం

పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై తిరుగుబావుటా ఎగరేసిన అగ్నికణం

మానవత్వ విలువలు ప్రబోధించిన శక్తి..

హన్మకొండ కల్చరల్‌ : పద్మ విభూషణ్‌ కాళోజీ నారాయణరావు.. ధిక్కార స్వారానికి మారుపేరు. ప్రశ్నించేతత్వానికి చిరునామా. ‘ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తం.. ప్రాంతేతరులు దోపిడీ చేస్తే తన్ని తరుముతాం.. దోస్తుగ ఉండే వారితో మే మూ దోస్తే చేస్తం.. ప్రాణమిస్తం.. ఎంతకు అంత అన్న ధోరణితో చింతమాని బతుకు సాగిస్తం’ అంటూ తన కవితల ద్వారా నిరంత రం పాలకులపై ధిక్కారస్వరం వి నిపించేవారు. తెలంగాణ మాండలికంలో తన రచనల ద్వారా ప్రజలను చైతన్య పరిచేవారు.ఈక్రమంలో మంగళవారం కాళోజీ జయంతి, తెలంగాణ భా షా (మాండలిక) దినోత్సవాన్ని పురస్కరించుకు ని కాళోజీ నారాయణరావుపై‘సాక్షి’ ప్రత్యేక కథనం.

ఏకీభవించనోని పీక నొక్కుటే ఫాసిజం..

శాంతిని అందరూ కోరుకుంటున్నట్లు మాట్లాడుతారు. శాంతిగా మెలగుటమంచిదే. కానీ శాంతి పరిస్థితి కలదా సఖుడా! అన్నది నా ప్రశ్న. ‘శాంతి శాంతట శాంతి గుండె మండిపోతుంటే, కండ కరిగిపోతుంటే బతుకు చితికిపోతుంటే, ఎముక విరిగిపోతుంటే శాంతి శాంతట శాంతి’. హింస హింస అని వూరికే అంటుంటారు. నా దృష్టిలోనూ హింస తప్పు. రాజ్యహింస మరీ తప్పు. ప్రతి హింస తప్పుకాదు. ఏకీభవించనోని పీక నొక్కు సిద్ధాంతం అంటే మరేమిటోకాదు అచ్చమైన ఫాసిజం. నాగొడవలో హిరణ్యకశిపుడు అచ్చమైన ఫాసిస్టు ప్రహ్లదుడు సత్యాగ్రహి, సత్యాగ్రహం వల్ల ఫాసిస్టుల్లో పరివర్తన జరగనప్పుడు నరసింహుల్లా ప్రతిహింస తప్పదు.

అన్యాయాన్నెదిరించిన వాడే ఆరాధ్యుడు..

మ్రోగుతున్న ప్రజల వాణి/ ఆగి మూగపోతున్నద?/ దోపిడీ పెత్తన్‌దారికి / తోడా? ఆ చావు కూడా/ ఎదిరించిన ప్రతీ వ్యక్తికి / ఈ వ్యవస్థలో అవస్థ/ రాజీపడు ‘మేతావి’/ పాజీలకు మజామజా.. అన్యాయాన్నెదిరించిన/ వాడు నాకు ఆరాధ్యుడు/ పేరుకు బతికున్న ప్రభుత్వం/ పేరుకు చస్తున్న ‘రాజు’ / అన్నాయాన్నేదిరిస్తే నాగొడవకు సంతృప్తి / అన్యాయం అంతరిస్తే/ నాగొడవకు ముక్తిప్రాప్తి.

ప్రశ్నించడం మానొద్దు..

ప్రశ్నలడగడంలో నేనేప్పుడు ప్రథముడినే. 1946లో నైజాం రాజును అడిగా నేను అడగడం మాత్రం మానలేదు. నిజమైన కవి అన్నవాడు జనం కోసం న్యాయం అడుగుతాడు. ఎవరి పనుల్లో వారు మునిగిపోగుడదు. ఎవరి బాగు వాళ్లు చూసుకుంటూ కూర్చోకూడదు. నిలదీసి ప్రశ్నించినవారిని ప్రభుత్వం బందిస్తుంది. వాళ్లమీద కక్షగడుతుంది. అయినా ప్రభుత్వం చూపించే ఎరలకు లొంగిపోకూడదు. ఆలోచించాలి.. అడగాలి. ప్రశ్నలు అందరూ అడగాలి. చైతన్యం కలిగించాలి. తిరగబడాలి. ఎదురించాలి.

రైతుబాధలు..

రాణివాసములోన రంజిల్లు రాజా/ రైతు బాధలు తీర్చి రక్షించ లేవా/ పట్టణపు సొగసుకై పాటుపడురాజా/ పల్లెకందము గూర్చు బాధ్యత తెలియదా?/ ప్రజలను హింసించు ప్రభువు మాకేల? / వధియించి భక్షించ వనరాజు లేడా?/ సామాన్య ప్రజలకు చైతన్య మొదవ/ చతురంగ బలముండ జంకేల రాజా?

జాగ్రత్త..

మనసు సంతలో బేరమాడబోకు/ బతుకు పెన్నిధిని గవ్వల కమ్మబోకు నిన్ను మించినదేమున్నది కోరుకొనగ/ ఆశనిరాశల వసతి మనసు కాగూడదెప్పుడు/ కలము గారడీ చేయకు కవితనెపుడు.

నడత – నాణ్యం..

దొంగవలె అందాల తొంగిచూచుట తప్పు/ ఆగుపడిన అందాన్ని అరయకుండుట తప్పు/ కనపడ్డ ప్ర తీదాని కానపడుటయు తప్పు/ భంగపడి వాంఛల కు లొంగిపోవుట తప్పు/ కినుకతో మదిలోన కృంగిపోవుట తప్పు/ పైకి ప్రహ్లదువలె పలుకుచుండుట తప్పు/ సహజ ప్రవృత్తులను చంపివేయట తప్పు/ సహజమని వృత్తుల చంకచేరుట తప్పు..

స్వేచ్ఛ..

బాధ్యత ఎరుగని స్వేచ్ఛ

బానిసత్వ లక్షణము

బాధ్యత ఎరిగిన స్వేచ్ఛ

స్వాతంత్రపు రక్షణము

వ్యక్తిత్వం..

‘ప్రతివారికి వ్యక్తిత్వం ఉంటేనే పౌరత్వం

వ్యక్తిత్వం భద్రంగా ఉంటేనే వ్యక్తి బతుకు

వ్యక్తిత్వం భద్రంగా ఉంటేనే జాతి బతుకు’

కాళోజీ నారాయణరావు (ఫైల్‌)

కవితలతో ప్రజల్లో నిత్యం

చైతన్యం నింపిన స్ఫూర్తి ప్రదాత

అన్యాయాలను ఎదురిస్తూ ప్రజాస్వామ్య విలువలు బోధించిన శక్తి..

నేడు కాళోజీ జయంతి, తెలంగాణ భాషా (మాండలిక) దినోత్సవం

మానవత్వ విలువలు ప్రబోధించిన శక్తి.. తన భావాలకే కాదు శరీరానికి మరణం లేదని నిరూపించిన వ్యక్తి పద్మ విభూషణ్‌ కాళోజీ నారాయణరావు. 1914 సెప్టెంబర్‌ 9వ తేదీన రంగారావు, రమబాయి దంపతులకు కాళోజీ జన్మించారు. పూర్తి పేరు రఘువీర్‌ నారాయణ్‌ లక్ష్మీకాంత్‌ శ్రీనివాసరాం రాజా కాళోజీ. మడికొండలో ప్రాథమిక విద్య, హనుమకొండ, హైదరాబాద్‌లలో ఉన్నతవిద్యనభ్యసించారు. కాళోజీ పదిహేనేళ్ల వయసు నుంచే రాజకీయ ఉద్యమాలు, కవిత, రచనా వ్యాసంగాలలో మునిగిపోయారు. ఆర్య సమాజం, ఆంధ్రమహాసభ , నిజాంస్టేట్‌ కాంగ్రెస్‌లో సభ్యుడిగా ఉంటూ నైజాం వ్యతిరేకపోరాటంలో పనిచేశారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత 1958 నుంచి 1960 వరకు ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యుడిగా , ఆంధ్రసారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీల్లో సభ్యుడిగా, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, కాళోజీ సతీమణి రుక్మిణి కాళోజీ ఉద్యమాలు, అరెస్ట్‌ల నేపథ్యంలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకున్నారు.

కాళోజీ అభిప్రాయాలు ...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement