
కుర్చీ మీద ప్రేమతోనే బీజేపీ హిందూ నినాదం
హన్మకొండ: కుర్చీ మీద ప్రేమతోనే బీజేపీ హిందూ నినాదం ఎత్తుకుందని, అధికారం కోసం అడ్డదారులు తొక్కుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు దుయ్యబట్టారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ సె క్యులరిజం, సోషలిజం పదాలను రాజ్యాంగం నుంచి తీసివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సీ బీఐ, ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలను వారికి అనుకూలంగా మలుచుకున్నారని, ప్ర శ్నిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారని తూర్పారబట్టారు. ఉప రాష్ట్రపతిగా పోటీ చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుకు బీజేపీ వక్రభాష్యం పలుకుతుందని విమర్శించారు. కమ్యూనిస్టులంటే ప్రధాని మోదీ, బీజేపీకి భయమన్నారు. భగత్ సింగ్, సుభాశ్‌చంద్రబోస్, దొడ్డి కొమురయ్య, చివరకు చాకలి ఐలమ్మ, తెలంగాణ సాయుధపోరాటాన్ని బీ జేపీ హైజాక్ చేసిందని మండిపడ్డారు. దేశానికి క మ్యూనిస్టుల అవసరం ఉందని, తామంత ఒకట య్యే సమయం వస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌పై రాష్ట్రంలో రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయని, బీ జేపీలో విలీనం కానుందని, ఇతర చర్చలు జరుగుతున్నాయన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి ఆశయ సాధనకు పార్టీ మందుకెళ్తుందన్నారు. సభలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు, సీపీఎం, సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శులు జి.ప్రభాకర్ రెడ్డి, కర్రె భిక్షపతి, సీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ బాషుమియా, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, నాయకులు నేదునూరి జ్యోతి, టి.వెంకట్రాములు, సదాలక్ష్మి, పనాస ప్రసాద్, మేక ల రవి, సిరబోయిన కరుణాకర్, వలీఉల్లాఖాద్రి, టి.విశ్వేశ్వర్ రావు, పల్లె నర్సింహ, తోట భిక్షపతి, మద్దెల ఎల్లేశ్, అరూరి కుమార్ పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
కూనంనేని సాంబశివరావు