
వైద్య రంగంలో ఫిజియోథెరపీ కీలకం
హన్మకొండ: వైద్య రంగంలో ఫిజియోథెరపీ చికిత్స కీలకమని వర్ధన్నపేట ఎమ్మె ల్యే కె.ఆర్.నాగరాజు అన్నారు. సోమవారం హనుమకొండ సుబేదారిలోని ఎస్‌ఆర్ కన్వెన్షన్‌లో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా లయన్స్ క్లబ్ హనుమకొండ ఫిజియోథెరపిస్ట్ ఆవిర్భావ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రోగుల ఆరోగ్య పునరుద్ధరణలో ఫిజియోథెరపీ చికిత్స కీలకమన్నారు. శరీర నొప్పులు, గాయాలు, స్ట్రోక్‌లు, శస్త్ర చికిత్సల అనంతర పునరావాసంలో ఫిజియోథెరపిస్ట్‌ల సేవలు అమూల్యమన్నారు. వీరి కృషితోనే అనేక మంది సాధారణ జీవితం గడుపుతున్నారన్నారు. వృత్తి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహాయం పొందేందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ సందర్భంగా ఫిజియోథెరపీ వైద్యులు, విద్యార్థులను సన్మానించారు. ఫిజియోథెరపీ వైద్యులు కూడా ఎమ్మెల్యే నాగరాజును సన్మానించారు. కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, ఫిజియోథెరిపీ వైద్యుల కమిటీ, లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు

వైద్య రంగంలో ఫిజియోథెరపీ కీలకం