పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పరకాల : 20 ఏళ్ల తర్వాత పట్టణంలోని శ్రీవాణి స్కూల్ పూర్వ విద్యార్థులు మంగళవారం ఆత్మీయ సమ్మేళనాన్ని సంబురంగా జరుపుకొన్నారు. విద్యార్థి దశలో తాము పాఠశాలలో వ్యవహరించిన తీరు, ఉపాధ్యాయులు తీసుకున్న శ్రద్ధను నెమరువేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించి ఆట పాటలతో సందడి చేశారు. వందలాది మంది విద్యార్థులతో కలకలలాడిన తమ పాఠశాల నేడు మూతబడిపోవడం బాధగా ఉందని పూర్వ విద్యార్థులు వాపోయారు. పునః ప్రారింభించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయులు సాజిద్ అలీ, రవికుమార్, సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, రాజేందర్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.


