హన్మకొండ అర్బన్: ఈనెల 11న టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయినట్లు హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 11 రూట్లలో 55 సెంటర్లు ఏర్పాట్లు చేసినట్లు, వీటిలో మొత్తం 21,036 అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రూట్ ఆఫీసర్లు, లైజన్ ఆపీసర్లు, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు, తదితర అధికారులు, సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఎవరూ సెల్‌ఫోన్లు, షూ, బ్లూ టూత్, ఎలక్ట్రానిక్ వస్తువులు వెంట తీసుకురావొద్దని సూచించారు.