గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో కాంట్రాక్టు వైద్య సిబ్బంది చేస్తున్న సమ్మెలో గురువారం ఏపీ ఎన్జీవో అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ ఘంటసాల శ్రీనివాసరావు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దంగా కాంట్రాక్ట్ పద్ధతిలో చేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రెగ్యులర్ వారితో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల్ని పర్మినెంట్ చేయాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. సమ్మెను ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని తగిన న్యాయం చేయాలని కోరారు. గుంటూరు నగర అధ్యక్షుడు చింతల కల్యాణ్ కుమార్ మాట్లాడుతూ నూరుశాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి కార్యదర్శి జీవి కోటేశ్వరావు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు పద్మజ, జిల్లా మహిళా చైర్‌పర్సన్ తజునున్నీసా, గుంటూరు మహిళా ఉపాధ్యక్షురాలు సునీత, సిటీ చైర్ పర్సన్ అరుణ, నర్సింగ్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


