గుంటూరు వెస్ట్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ – ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ (మా – ఏపీ) సినిమా డైరీని గురువారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ విడుదల చేశారు. టాలీవుడ్ దర్శకుడు, మా– ఏపీ వ్యవస్థాపకుడు దిలీప్ రాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులైన నటీనటులు పాల్గొన్నారు. దిలీప్ రాజా మాట్లాడుతూ తెనాలి కేంద్రం 587 సభ్యులతో యూనియన్ కొనసాగుతోందని గుర్తుచేశారు. ఔత్సాహిక కళాకారుల డైరీని సినీ పరిశ్రమలో కొందరు ప్రముఖులకు అందజేస్తామని ఆయన తెలిపారు. కళాకారులు చక్కని భవిష్యత్తు సొంతం చేసుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.


