సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి రిమాండ్‌

Oct 9 2026 2:02 AM | Updated on Oct 9 2026 2:02 AM

గుంటూరు లీగల్‌: ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం తూమాడు గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త సాగిల అనిల్‌కుమార్‌రెడ్డిని సీఐడీ పోలీసులు బుధవారం హైదరాబాద్‌లోని విమానాశ్రయంలో అరెస్టు చేశారు. మంగళగిరిలోని సంబంధిత న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో ఆయనను గుంటూరులోని నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో గురువారం హాజరుపర్చారు. న్యాయమూర్తి మైలాబత్తుల శోభారాణి సమక్షంలో న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అనిల్‌కుమార్‌రెడ్డికి కోర్టు ఈ నెల 22వ తేదీ వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. అనంతరం ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. అనిల్‌కుమార్‌రెడ్డి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నారు. తన తండ్రికి అనారోగ్యం కారణంగా బుధవారం భారత్‌ వచ్చారు. సమాచారం తెలుసుకున్న సీఐడీ పోలీసులు హైదరాబాద్‌ విమానాశ్రయంలో లుక్‌ అవుట్‌ నోటీసు ఉన్నట్లు తెలిపి, ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫొటోలు మార్ఫింగ్‌ చేసినట్లు ఆరోపిస్తూ 2025లో సీఐడీ అధికారులు మంగళగిరిలో కేసు నమోదు చేశారు. మొదటి దశ ఎఫ్‌ఐఆర్‌లో అనిల్‌కుమార్‌రెడ్డి పేరు లేనప్పటికీ ప్రస్తుతం ఏడో నిందితుడిగా చేర్చారు. కేసులోని ఇతర నిందితులపై నమోదైన ఆరోపణల దర్యాప్తు క్రమంలో అనిల్‌కుమార్‌రెడ్డి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయని, అందుకే అరెస్ట్‌ చేసినట్లు సీఐడీ వర్గాలు పేర్కొంటున్నాయి.

కారం దుకాణాల్లో తనిఖీలు

గుంటూరు మెడికల్‌: నిబంధనలకు విరుద్ధంగా, నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి కారం విక్రయాలు చేస్తున్న షాపుల్లో గురువారం ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు చేశారు. గుంటూరు బండ్లబజారు, ఏలూరు బజారులోని రోహిత్‌సాయిశ్రీ ఎంటర్‌ప్రైజెస్‌, పవన్‌కుమార్‌ మిర్చిషాపు, శివన్నారాయణ చిల్లీపౌడర్‌ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. నాణ్యత లేని 40 కిలోల కారం సీజ్‌ చేశారు. అనుమతులు లేకుండా వ్యాపారాలు చేస్తున్నట్లు, లేబుల్స్‌ లేకుండా ప్యాకెట్లు అమ్ముతున్నట్లు గుర్తించారు. షాపుల యాజమానులకు నోటీసులు జారీ చేశారు. కేసులు నమోదు చేయటంతోపాటుగా కారం పొడి శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించాలమని అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ నూతలపాటి పూర్ణచంద్రరావు తెలిపారు. తనిఖీల్లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు నరసింహుడు, వెంకటేశ్వరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement