సహకార సంఘాల్లో పారదర్శకతకు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

సహకార సంఘాల్లో పారదర్శకతకు పెద్దపీట

Oct 9 2026 2:02 AM | Updated on Oct 9 2026 2:02 AM

కొరిటెపాడు(గుంటూరు): సహకార సంఘాల కార్యకలాపాల్లో పారదర్శకతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌(జీడీసీసీబీ) చైర్మన్‌ మక్కెన మల్లికార్జునరావు అధికారులను ఆదేశించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని 44 జీడీసీసీబీ బ్యాంకు శాఖల ఫీల్డ్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, నోడల్‌ అధికారులతో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రతి సూపర్‌వైజర్‌ తమ పరిధిలోని సహకార సంఘాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. సంయుక్త నివేదికలను ఈ నెలాఖరులోగా పరిపాలనా కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. ప్రతి లావాదేవీ పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు. వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సీఈఓలను త్వరలో బదిలీ చేయనున్నట్లు తెలిపారు. బ్యాంక్‌ సీఈఓ వీవీఎస్‌ ఫణికుమార్‌, సీనియర్‌ అధికారులు, నోడల్‌ అధికారులు, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని 44 బ్రాంచీల ఫీల్డ్‌ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement