వాస్తవ విస్తీర్ణం మేరకు భూ సమీకరణ | - | Sakshi
Sakshi News home page

వాస్తవ విస్తీర్ణం మేరకు భూ సమీకరణ

Oct 8 2026 3:30 AM | Updated on Oct 8 2026 3:30 AM

తాడికొండ: రైతులు వాస్తవంగా చూపిన విస్తీర్ణం మేరకు మాత్రమే భూ సమీకరణ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ స్పష్టం చేశారు. అమరావతి రెండో విడత భూ సమీకరణలో భాగంగా తుళ్ళూరు మండలం వడ్డమాను గ్రామంలో బుధవారం జరిగిన గ్రామసభలో జిల్లా కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీ సర్వే, పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా భూమి తీసుకుంటామన్నారు. స్పష్టమైన హద్దులను పత్రాల ఆధారంగా చూపించాలని కోరారు. రైతులు ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ పాసు పుస్తకం, పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్‌ డీడ్‌, భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పత్రాలు, లింక్‌ డాక్యుమెంట్‌లు, ఆధార్‌ లింక్‌ చేసిన ఫోన్‌ నెంబర్‌, రెండు ఫొటోలు సమర్పించాలన్నారు. డొంక రోడ్లు, ప్రభుత్వ భూమి కలిసిన భూములు ఉంటే వాటి వాస్తవ విస్తీర్ణం మేరకు మాత్రమే తీసుకుంటామన్నారు. రైతులు మాట్లాడుతూ తమ వద్ధ దీర్ఘకాలంగా ఉన్న పత్రాలు, రీ సర్వేలో తేలుతున్న కొలతలు సరిపోలడం లేదన్నారు. వాటిని సరి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ కొల్లాబత్తుల కార్తిక్‌, రెవెన్యూ డివిజనల్‌ అధికారి కె. శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్‌ రాఘవేంద్ర, తహసీల్దార్‌ హరిబాబు, సర్వే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

బాణసంచా దుకాణాల తనిఖీకి బృందాలు

గుంటూరు వెస్ట్‌: బాణసంచా హోల్‌సేల్‌, పేలుడు పదార్థాల దుకాణాలను తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల, పట్టణ ప్రాంతాల్లోని దుకాణాలను క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలన్నారు. వీటితో పాటు ప్రాంగణం మొత్తం స్థితి, అత్యవసర మార్గాలు, అగ్నిమాపక పరికరాలకు చేరుకునేందుకు వీలు, నిల్వ ఏర్పాట్లు, విద్యుత్‌ భద్రత, అగ్నిమాపక యంత్రాల లభ్యత, పనితీరు, అగ్ని, ప్రాణ, పేలుడు పదార్థాల భద్రతకు సంబంధించిన ఇతర పరిస్థితులను కమిటీ ధ్రువీకరించాలని పేర్కొన్నారు. లోపాలు, ఉల్లంఘనలు ఉంటే స్పష్టంగా పేర్కొనాలని చెప్పారు.

జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement