అమరావతి సాహిత్య ఉత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అమరావతి సాహిత్య ఉత్సవాలు ప్రారంభం

Oct 8 2026 3:30 AM | Updated on Oct 8 2026 3:30 AM

అమరావతి సాహిత్య ఉత్సవాలు ప్రారంభం ‘ఐఎంసీ–2026’లో విజ్ఞాన్‌ ప్రతిభ

మంగళగిరి రూరల్‌/మంగళగిరి టౌన్‌: ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో బుధవారం అమరావతి సాహిత్య ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమానికి ఏపీ సృజనాత్మకత, సాంస్కృతిక సంస్థ చైర్‌పర్సన్‌ తేజస్వి పొడపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీసీ ఆచార్య సీహెచ్‌ సతీష్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ సాహిత్య ఉత్సవాల వీడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తేజస్వి పొడపాటి మాట్లాడుతూ తెలుగు భాష సాహిత్యం విలువ వెలకట్టలేనిదని మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దే శక్తి తెలుగు సాహిత్యానికి ఉందని అన్నారు. మరో ముఖ్య అతిథి గుంటూరు జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ మాట్లాడుతూ పుస్తక పఠనంతో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు సంభాషణా నైపుణ్యాలు మెరుగుపడతాయన్నారు. అమరావతి గొప్పదనాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా సాహిత్య ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వీసీ ఆచార్య సీహెచ్‌ సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన కవులు, రచయితలను ఒకే వేదికపైకి తీసుకురావడమే అమరావతి సాహిత్య ఉత్సవాల ప్రధాన ఉద్దేశమన్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రెండు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారాలను అందించనున్నట్లు తెలిపారు. పురస్కారాల ఎంపికకు ప్రత్యేక జ్యూరీని ఏర్పాటు చేస్తామన్నారు. మూడు రోజుల పాటు జరిగే సాహిత్య ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా కవులు, రచయితలు, సాహిత్యాభిలాషులు హాజరయ్యారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ రచయిత్రి మినీ కృష్ణన్‌ సాహిత్య ఉత్సవాల ప్రాధాన్యత, సమాజంపై సాహిత్యం చూపే ప్రభావాన్ని వివరించారు. ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలు సాహిత్య అభిమానులు ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో డీన్‌ డాక్టర్‌ విష్ణుపథ్‌, ఉత్సవాల కన్వీనర్లు డాక్టర్‌ ఆర్గాబసు, డాక్టర్‌ శయంతన్‌ ఠాగూర్‌ తదితరులు పాల్గొన్నారు.

చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన వినూత్న సాంకేతిక ఆవిష్కరణలు న్యూఢిల్లీలోని యశోభూమిలో నిర్వహించిన ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసీ)–2026లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జాతీయస్థాయిలో నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో విజ్ఞాన్‌ యూనివర్సిటీ ప్రత్యేక ఎగ్జిబిషన్‌ స్టాల్‌ను ఏర్పాటు చేసి, విద్యార్థుల సాంకేతిక ప్రతిభ, ఆవిష్కరణ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. విజ్ఞాన్‌ యూనివర్సిటీకి చెందిన డీన్లు, డైరెక్టర్లు, అధ్యాపకులు, ఈసీఈ, సీఎస్‌ఈ–ఐఓటీ, రోబోటిక్స్‌ విభాగాలకు చెందిన విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొని వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే సాంకేతిక ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్‌ శాఖ సహాయ మంత్రివర్యులు డాక్టర్‌ చంద్ర శేఖర్‌ పెమ్మసాని స్టాల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రతిష్టాత్మక జాతీయ వేదికపై విద్యార్థులు, అధ్యాపకులు, డీన్లు, డైరెక్టర్లు, మొత్తం బృందాన్ని చైర్మన్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ శ్రీకృష్ణదేవరాయలు, సీఈవో డాక్టర్‌ మేఘన కూరపాటి, వైస్‌ చాన్స్‌లర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌, రిజిస్ట్రార్‌ పీఎంవీ రావు తదితరులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement