మంగళగిరి రూరల్: ఆంద్ర ప్రిమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లు ఫైనల్, సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జూలై నెల 31 నిర్వహించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేశినేని శివనాథ్ తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. తొలుత మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని లాంఛనంగా ప్రారంభించారు. శివనాథ్ మాట్లాడుతూ బీసీసీఐ నిబంధనల ప్రకారం 175 రోజులు అంతర్జాతీయ షెడ్యూల్‌కు సరిపోయేలా మౌలిక వసతులు, సదుపాయాలు మెరుగుపరచినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏపీఎల్ మ్యాచ్‌లకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మ్యాచ్ వీక్షించడానికి టికెట్ అవసరం లేదని పూర్తిగా ఉచితం అన్నారు. రాబోయే రోజుల్లో అంర్జాతీయ స్థాయి మ్యాచ్‌లు ఆతిథ్యం ఇవ్వడానికి స్టేడియ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఎంఎస్ కుమార్, ఏపీఏ ట్రెజరర్ దండమూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.


