గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Jun 7 2026 8:12 AM | Updated on Jun 7 2026 8:12 AM

ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్‌ శ్రీ 2026 వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో సవాలక్ష నిబంధనలు నిమ్మకాయల ధరలు పులిచింతల సమాచారం సంగీతంతో సాధకులకు ఆయుర్దాయం యంత్ర సాయం అందజేయాలి

న్యూస్‌రీల్‌

‘నాదసుధార్ణవ’ అన్నవరపు రామస్వామి ‘దేవన్‌ ద్రోణ్‌’కు గద్దె రామకుమారి పురస్కారం

అందరికీ ఇవ్వాలి..

మూడేళ్ల ఈ–క్రాప్‌ ఉన్నవారే అర్హులు ఇన్‌చార్జ్‌ మంత్రి ఆమోదముంటేనే! లాటరీలో అదృష్టముంటేనే.. పచ్చచొక్కాలకు లబ్ధి చేకూర్చేందుకే నిబంధనలు అంటున్న రైతులు యంత్రాల సబ్సిడీలో మాయాజాలం వైఎస్సార్‌ సీపీ హయాంలో పారదర్శకంగా..

వైఎస్‌ జగన్‌ హయాంలో పండుగ

ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్‌ శ్రీ 2026
వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో సవాలక్ష నిబంధనలు

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1,200, గరిష్ట ధర రూ.3,000, మోడల్‌ ధర రూ.2,000 వరకు పలికింది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.

తెనాలి: సంగీతం భక్తిభావంతోపాటు సాధకుడి ఆయుర్దాయాన్ని పెంచుతుందని ప్రముఖ నాదస్వర విద్వాంసుడు ‘నాదసుధార్ణవ’ అన్నవరపు రామస్వామి అన్నారు. అందుకు తానే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పారు. పట్టణానికి చెందిన సంగీత సంస్థ హేమాద్రి మ్యూజిక్‌ అకాడమీ ఆధ్వర్యంలో ‘గాన విదుషి’ గద్దె వేంకట రామకుమారి ఏకాదశ వర్ధంతి సంగీత ఉత్సవాన్ని శనివారం సాయంత్రం బోసురోడ్డులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆవరణలోని కళావేదికపై నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రవచకులు ములుకుట్ల విశ్వనాధశర్మ అధ్యక్షత వహించారు. గద్దె వేంకట రామకుమారి స్మారక సంగీత పురస్కారం–2026ను ప్రముఖ వయొలిన్‌ విద్వాంసులు డీవీకే వాసుదేవన్‌, ఫ్లూట్‌ విద్వాంసులు డి.ఫణికుమార్‌ (దేవన్‌ద్రోణ్‌ ద్వయం)కు ప్రదానం చేశారు. ముఖ్యఅతిథి రామస్వామి మాట్లాడుతూ గద్దె రామకుమారి గొప్ప సంగీత గురువుగా చెప్పారు. ఏటా ఆమె వర్ధంతిని తెనాలిలో వైభవంగా నిర్వహిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. వివేక విద్యాసంస్థల డైరెక్టర్‌ డాక్టర్‌ రావిపాటి వీరనారాయణరావు మాట్లాడుతూ, సంగీతంలో తనదైన ఒరవడిని సృష్టించుకున్న రామస్వామి కొత్త రాగాలు, తాళాలను రూపకల్పన చేశారని చెప్పారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రామరాజు పాల్గొంటారు. వినూత్న వాద్య ద్వయం దేవన్‌ ద్రోణ్‌ల సంగీత సేవను అభినందించారు. సభానంతరం సభానంతరం డి.ఫణికుమార్‌ వేణువుపై, డీవీకే వాసుదేవన్‌ వయోలిన్‌పై సంగీత కచేరీ కొనసాగింది.

వ్యవసాయ యంత్ర పరికరాలు రైతులకు ఎంతో ఉపయోగకరం. వీటిని అర్హులకు ఇవ్వాలి. కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పేవారికే ఇవ్వకూడదు. అలాగే కౌలు రైతులనూ దృష్టిలో పెట్టుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌలు రైతులకు రైతు భరోసా కూడా అందడం లేదు. కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు ఇచ్చి, వారి పంటలను నమోదు చేసి సబ్సిడీ యంత్ర పరికరాలు అందజేయాలి.

– కంచుమాటి అజయ్‌కుమార్‌, ఏపీ రైతు సంఘం, జిల్లా అధ్యక్షుడు, గుంటూరు

కొరిటెపాడు(గుంటూరు): యంత్రాల సబ్సిడీ పంపిణీలో చంద్రబాబు ప్రభుత్వం మాయాజాలం ప్రదర్శిస్తోంది. నిబంధనల పేరుతో రైతులకు రాయితీ యంత్రాలను దూరం చేస్తోంది. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమంటూ గొప్పలు పలికిన సీఎం చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత సబ్సిడీ యంత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అయితే రైతుల మెడపై నిబంధనల కత్తి వేలాడదీస్తూ మరోసారి కుచ్చుటోపీ పెట్టేందుకు సిద్ధమయ్యారు.

జిల్లాకు 849 పరికరాలు మంజూరు

పంటకోత, నూర్పిడి పరికరాలు 11, మొక్కల సంరక్షణ పరికరాలు 560, పంట కోత అనంతరం ప్రాసెసింగ్‌, విలువ జోడించు యంత్రాలు 12, పవర్‌ ట్రిల్లర్స్‌ 40, పశుగ్రాసం కట్టకట్టే పరికరాలు 40, స్వీయ చోదక యంత్రాలు 67, మొక్కలు నాటడం, తవ్వే యంత్రాలు 9, ట్రాక్టర్‌ పవర్‌ టిల్లర్‌ నడిచే పరికరాలు 81, ట్రాక్టర్లు 29 కలిపి మొత్తం 849 యంత్ర పరికరాలు ఇవ్వనున్నారు.

ఈ మేరకు జిల్లాకు రూ.3.39 కోట్లు మంజూరు చేశారు. అయితే ఇవన్నీ అర్హులకు అందుతాయా లేదా కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పినవారికే ఇస్తారా అనే సందేహం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఉపాధి నిధులతో గతేడాది గ్రామాల్లో పశువుల శాలలు మంజూరు చేయగా.. అవన్నీ టీడీపీ వారికే ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా పథకం ఏదైనా పచ్చ చొక్కాలకే వెళ్తున్నాయి. దీంతో తాజాగా వ్యవసాయ యంత్ర పరికరాలు కూడా అర్హులకు అందుతాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది.

నిబంధనల శరాఘాతం..

చంద్రబాబు ప్రభుత్వం సబ్సిడీ యంత్ర పరికరాలు పొందేందుకు పలు నిబంధనలు విధించి సామాన్య రైతులకు తీరని అన్యాయం చేస్తోంది. మూడేళ్లలో మూడు సార్లు ఈ–పంట నమోదు చేసి ఉండాలన్న నిబంధన విధించడం చాలామంది రైతులకు శరాఘాతంలా మారింది. ఒకవేళ అర్హత సాధించినా లాటరీలో అదృష్టం వరించాలి. ఆపై జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఆమోదంతోనే జాబితా తయారవుతుంది. ట్రాక్టర్‌ మంజూరై డిపాజిట్లు మొత్తం ముందే చెల్లించినా సబ్సిడీ మాత్రం జూలైలో అందజేస్తామని పేర్కొనడం గమనార్హం.

ఇన్‌చార్జ్‌ మంత్రి ఆమోదం ఉంటేనే..!

నిబంధనల పేరిట టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అర్హులకు దూరం చేయనుందనే విమర్శలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే రైతులు తప్పనిసరిగా మూడేళ్ల పాటు ఈ–క్రాప్‌ నమోదు కలిగి ఉండాలి, కుటుంబంలో ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన తప్పనిసరి చేశారు. జిల్లాలోని 18 మండలాల్లో 4,13,604 ఎకరాల్లో రైతులు ఈ–క్రాప్‌ కలిగి ఉన్నారు. సన్న చిన్నకారు రైతులు ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం సబ్సిడీ, మిగిలిన రైతులకు 40 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడి వరకూ బాగున్నా.. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను లాటరీ ప్రక్రియ ద్వారా జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఎంపిక చేయనున్నారు. ఇక్కడే అసలు తిరకాసు ఉంది. లాటరీలో టీడీపీకి చెందని వారి పేరు వస్తే వారికి యంత్ర పరికరాలను అందించేందుకు ఇన్‌చార్జ్‌ మంత్రి ఆమోద ముద్ర వేస్తారా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. నియోజకవర్గాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను కాదని ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వారికి యంత్రాల పంపిణీ కలగానే మిగలనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సమృద్ధి కేంద్రం ప్రారంభించిన పెమ్మసాని

9

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసిన వెంటనే ప్రతి ఏటా సబ్సిడీ ట్రాక్టర్లు, ట్రాక్టర్‌ పనిముట్లు, వ్యవసాయ పరికరాలను పారదర్శకంగా అందజేశారు. పంపిణీ చేసిన రోజే వాటికి సంబంధించిన సబ్సిడీ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ వందలాది మంది ముందుకు వచ్చారు. అప్పట్లో ప్రతి సచివాలయానికి ఒక ట్రాక్టర్‌ మంజూరు చేశారు. ఇక వ్యవసాయ పనిముట్లు అడిగిన రైతులందరికీ మంజూరు చేశారు. ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు, వరికోత మిషన్లు, ట్రాక్టర్‌ పనిముట్లు, రోటో వేటర్‌, స్పేయర్లు అందజేశారు.

రైతులు ఎంతో ఆశతో సబ్సిడీ పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కూటమి పాలనలో అర్హులకు యంత్ర పరికరాలు అందుతాయనే నమ్మకం కలగడం లేదు. వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉన్నప్పుడు అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశారు. కూటమి ప్రభుత్వం కూడా దానిని పాటించాలి. అర్హులైన రైతులకు యంత్ర సాయం చేయాలి.

–తియ్యగూర పేరిరెడ్డి, వట్టిచెరుకూరు మండలం, రైతు, గారపాడు

Advertisement
 
Advertisement
Advertisement