న్యూస్‌రీల్
పట్టించుకునే వారే లేరు...
పులిచింతల సమాచారం
నిమ్మకాయల ధరలు
సాగర్ నీటిమట్టం
బుధవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2026
రైతులపై బాబు మార్క్ రాజకీయం
● మాజీ సీఎం జగన్‌తో
రాజధాని రైతుల సమావేశం
● అధికార పార్టీలో కలకలం
● అగమేఘాలపై పెనుమాకలో
అన్నదాతలతో సీఆర్డీఏ సమావేశం
● గ్రామ సభను బహిష్కరించిన రైతులు
● రాజధానికి భూములిచ్చినా
ఎందుకు వేధిస్తున్నారని నిలదీత
● తమపై కక్ష సాధింపు
మానుకోవాలని హితవు
● రైతులకు అండగా ఉంటామన్న
మాజీ సీఎం వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: భూములు ఇవ్వని రాజధాని రైతులను చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తోంది. నయానో భయానో భూములు లాక్కొనేందుకు చేయాల్సినదంతా చేస్తోంది. ఉండవల్లి, పెనుమాక రైతులు భూములు ఇవ్వడానికి మొదటి నుంచి ఇష్టపడటం లేదు. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం, కొండవీటి వాగు విస్తరణ కోసం... ఇతర రోడ్ల కోసం అవసరమైన భూమిని ఇప్పటికే ఇచ్చారు. ప్రభుత్వం మిగిలిన భూమిని కూడా బలవంతంగా తీసుకునేందుకు భూసేకరణ నోటీసులు జారీ చేసింది. దీన్ని ఆయా గ్రామాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ గోడు వెళ్లబుచ్చుకునేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలవాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం వారు కలవడానికి సిద్ధం కాగానే విషయం తెలుసుకున్న ప్రభుత్వం కంగారు పడింది. అప్పటికప్పుడు పెనుమాకలో గ్రామసభ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రబాలెం, కురగల్లుకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఉండవల్లి అనేది లోతట్టు ప్రాంతమని, తాము భూములు ఇవ్వకుండానే ప్లాన్లు గీసేశారని పేర్కొన్నారు. ఉండవల్లి గ్రామాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఉండవల్లి భూములు చాలా విలువైనవని, రాజధాని రాకముందే తమ గ్రామంలో అపార్ట్‌మెంట్లు ఉన్నాయని గుర్తుచేశారు. ఇప్పటివరకూ ఉండవల్లి రోడ్డునే అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు. ఉండవల్లిలోనే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఉంటున్నారని గుర్తుచేశారు. అయినా కనీసం రోడ్డు కూడా అభివృద్ధి చేయరా? అని నిలదీశారు. రాజధానికి భూములు ఇస్తే పిల్లలకు స్కూలు ఫీజులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అన్నారని పేర్కొన్నారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో ప్లాట్లను కనీసం అభివృద్ధి కూడా చేయలేదన్నారు. రాజధానిలో తవ్వుకున్న మట్టిని విక్రయించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల సమస్యలను విన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారికి అండగా తాము ఉంటామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న భూములను వెనక్కి ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. ఒకపక్క రైతుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడం, మరోపక్క ఆ రైతులు మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలవడంతో ప్రభుత్వంలో కలకలం రేగింది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు ప్రెస్‌మీట్ పెట్టి వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో రైతులే లేరంటూ దుష్ప్రచారానికి తెరలేపారు. అయితే వైఎస్ జగన్‌ను కలిసిన వారందరూ భూసేకరణ బాధితులే కావడం గమనార్హం.
7
తమ సమస్యలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, భూములు ఇచ్చేవరకూ తమ చుట్టూ తిరిగారని రైతులు వాపోయారు. భూములు ఇచ్చిన తర్వాత తాము అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరకట్ట రోడ్డును విస్తరణ చేస్తే సరిపోతుందని, కొత్తగా భూములు తీసుకోవాల్సిన అవసరం లేదని రైతులు వాదిస్తున్నారు. అయినా అధికారుల నుంచి స్పందన లేదు. భూసేకరణ తప్పనిసరి కాదని, ఇప్పటికై నా పూలింగ్‌కు ఇవ్వవచ్చంటూ హితబోధ చేశారు. అధికారుల వైఖరి పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.
తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.3,500, మోడల్ ధర రూ.2,700 వరకు పలికింది.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 519.90 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి 7,933 క్యూసెక్కులు వస్తోంది.
కనీసం గ్రామ సభకు నాలుగు రోజుల సమయం ఉంటుంది. హడావిడిగా మీటింగ్ ఉందంటూ సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రకటించారు. అయినా రైతులు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు గ్రామసభకు వచ్చారు. 11 గంటల వరకూ అధికారులు మాత్రం రాలేదు. ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. దీంతో గతంలో భూములు ఇచ్చిన రైతులను తీసుకువచ్చి సమావేశంలో కూర్చొబెట్టారు. వారు కూడా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. 12 ఏళ్ల క్రితం భూములు ఇచ్చినా ఇప్పటివరకూ గ్రామ కంఠాలు నిర్ణయించలేదన్నారు. ఎక్కడో పల్లపు ప్రాంతాల్లో ప్లాట్లు ఇచ్చారని, అవి కూడా అభివృద్ధి చేయలేదని నిరసన తెలిపారు.


