ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై విద్యార్థులకు పోటీలు | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై విద్యార్థులకు పోటీలు

Jun 3 2026 1:15 AM | Updated on Jun 3 2026 1:15 AM

ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై విద్యార్థులకు పోటీలు

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం(గుంటూరు) ఆధ్వర్యంలో రూపొందించిన వేస్ట్‌ టూ ఆర్ట్‌, వేస్ట్‌ టే వెల్త్‌ పర్యావరణ అవగాహన పోటీల పోస్టర్లను జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీమ్‌ బాషా ఆవిష్కరించారు. మంగళవారం డీఈఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పర్యావరణ ఇంజినీర్‌ ఎండీ నజీనా బేగం మాట్లాడుతూ ఇటువంటి పోటీలు విద్యార్థుల్లో సృజనాత్మకత, శాసీ్త్రయ దృక్పథం, పర్యావరణ బాధ్యతను పెంపొందిస్తాయని తెలిపారు. పాఠశాల, ఇంటర్మీడియెట్‌, డిగ్రీ విద్యార్థులు వ్యక్తిగతం, బృందాలుగా పాల్గొనవచ్చునని వివరించారు. పాల్గొనే వారందరికీ సర్టిఫికెట్లు అందజేస్తామని, ఉత్తమ నమూనాలను రూపొందించిన వారికి బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement