ఏఎన్‌యూ(పెదకాకాని): ఏపీ పీసెట్–2026 ప్రవేశ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కన్వీనర్ డాక్టర్ పీపీఎస్ పాల్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో బుధవారం నుంచి ఈనెల 8వ తేదీ వరకూ దేహదారుఢ్య పరీక్ష, క్రీడా నైపుణ్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. 2026–27 విద్యాసంవత్సరం బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి బుధవారం నుంచి ఈనెల 6వ తేది వరకూ పురుషులకు, ఏడు నుంచి 8వ తేదీ వరకూ సీ్త్రలకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. బుధవారం హాల్ టికెట్ నెంబరు 10001 నుంచి 10715, 4న 10716 నుంచి 11430 వరకూ, 5న 11431 నుంచి 12144 వరకూ జరుగుతాయన్నారు. 6న 12145 నుంచి 12858 వరకూ, 7న 30001 నుంచి 30680 వరకు, 8న 30681 నుంచి 31179 వరకూ జరుగుతాయన్నారు. పురుషులకు 100 మీటర్లు, 800 మీటర్లు పరుగు, షాట్ ఫుట్, లాంగ్‌జంప్ గానీ హైజంప్ అంశాల్లో తప్పని సరిగా పాల్గొనాలన్నారు. నిర్దేశిత ఆటల్లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న నైపుణ్యం పరీక్షించబడుతుందని ఏపీ పీసెట్ కన్వీనర్ వివరించారు.


