సొంతంగా కంపెనీ స్థాపిస్తా.. | - | Sakshi
Sakshi News home page

సొంతంగా కంపెనీ స్థాపిస్తా..

Jun 3 2026 1:15 AM | Updated on Jun 3 2026 1:15 AM

సొంతంగా కంపెనీ స్థాపిస్తా.. ●

మా స్వస్థలం సత్తెనపల్లి. 6వ తరగతి నుంచి గుంటూరులోని భాష్యం ఐఐటీ–జేఈఈ అకాడమీలో చదువుతున్నాను. నాన్న పిచ్చిరెడ్డి వ్యవసాయం చేస్తున్నారు. అమ్మ గౌతమి గృహిణి. ఐఐటీలో సీటు సాధించాలనే లక్ష్యంతో రోజుకు 13 గంటలపాటు చదివాను. కాలేజీలో ఇచ్చిన ప్రణాళికను అనుసరిస్తూ, అధ్యాపకుల నుంచి ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకున్నాను. మంచి ర్యాంకు సాధించాలని కష్టపడ్డాను. అయితే ఎక్కడా ఒత్తిడికి లోను కాలేదు. ముంబై ఐఐటీలో సీఎస్‌ఈ బ్రాంచ్‌లో చేరతాను. చదువు పూర్తయ్యాక సొంతంగా స్టార్టప్‌ ప్రారంభిస్తాను.

– వెన్నా ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి,

34వ ర్యాంకు (ఓపెన్‌ కేటగిరీ)

Advertisement
 
Advertisement
Advertisement