గుంటూరు ఎడ్యుకేషన్: సోమవారం ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్‌డ్–2026 ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థులు ఆలిండియా అత్యుత్తమ ర్యాంకులతో సంచలనం సృష్టించారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. చంద్రమౌళీనగర్‌లోని మెయిన్ క్యాంపస్‌లో జరిగిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థి వెన్నా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అఖిల భారతస్థాయి ఓపెన్ కేటగిరీలో 34వ ర్యాంకు కై వసం చేసుకుని విజయకేతనం ఎగురవేశాడని చెప్పారు. 6వ తరగతి నుంచి భాష్యం ఐఐటీ ఫౌండేషన్‌తో ఘన విజయాన్ని సాధించాడని అన్నారు. వివిధ కేటగిరీల్లో జె.చాము వర్షిత్ అఖిలభారతస్థాయిలో 3వ ర్యాంకు, సీహెచ్ సాహిల్ 6వ ర్యాంకు, డి.పవన్‌కుమార్ 16వ ర్యాంకు, కె.రామకృష్ణారెడ్డి 23వ ర్యాంకు, వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి 34వ ర్యాంకు, హఫీజ్ నూర్‌బాషా 42వ ర్యాంకు, వై.ప్రవచన 54వ ర్యాంకు, ఆర్.బాలానాయక్ 76వ ర్యాంకు, సీహెచ్.వెంకట నాగపవన్ 82వ ర్యాంకు వంటి అత్యుత్తమ ర్యాంకులు సాధించామని చెప్పారు. 100లోపు తొమ్మిది, 200లోపు 21, 500లోపు 53, వెయ్యిలోపు 93, రెండువేలలోపు 126, ఐదువేల లోపు 235 ఆలిండియా ర్యాంకులు సాధించడంతో పాటు ఐఐటీ సెలెక్షన్స్‌లో ఆలిండియా అల్ టైం ది బెస్ట్‌గా నిలిచిందన్నారు. ఇటీవల జేఈఈ మెయిన్స్‌లో ఓపెన్ కేటగిరిలో 100 పర్సంటైల్ తో పాటు ఆలిండియా 11వ ర్యాంకు సాధించిన భాష్యం విద్యార్థి టి.దుర్గా సుప్రభాత్‌కు రూ.10 లక్షల చొప్పున ఉన్నత చదువు కోసం నగదు ప్రోత్సాహక చెక్కు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈసందర్భంగా విద్యార్థులను ఛైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్, భాష్యం ఐఐటీ ప్రోగ్రామర్ ఆనందకుమార్ అభినందించారు


