తాడికొండ: వ్యూహాత్మక ఆలోచన, క్రమశిక్షణ, సహనం, నిర్ణయ సామర్థ్యాలను పెంపొందించే ఆట చెస్ అని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ సహకారంతో వీఐటీ–ఏపీ విశ్వవిద్యాలయం తొలిసారి నిర్వహిస్తున్న వీఐటీ –ఏపీ అమరావతి అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్– 2026 సోమవారం ఘనంగా ప్రారంభమైంది. డీజీపీ మాట్లాడుతూ నాయకత్వం, దేశ నిర్మాణానికి అత్యంత అవసరమైన లక్షణాలు చెస్ ద్వారా పొందవచ్చన్నారు. అంతర్జాతీయ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్న వీఐటీ–ఏపీ విశ్వవిద్యాలయం, ఆంధ్ర చెస్ అసోసియేషన్‌్‌ను ఆయన అభినందించారు. వీఐటీ–ఏపీ విశ్వవిద్యాలయ వైస్–చాన్స్‌లర్ డాక్టర్ పి.అరుళ్‌మొళి వర్మన్, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎ సురేష్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ చైర్మన్ కె.వి.వి.శర్మ మాట్లాడారు. గుంటూరు ఈగిల్ సెల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నగేశ్, ‘‘డ్రగ్స్ రహిత భారతదేశం – డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్’’ లక్ష్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారితో ప్రతిజ్ఞ చేయించారు.
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా


