జీజీహెచ్‌లో కొన్ని వైద్య విభాగాల్లో అత్యవసర మందులు, సర్జికల్ వస్తువులు అందుబాటులో ఉండక చికిత్స పొందుతున్న రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఓపీలో సైతం అన్ని మందులు అందుబాటులో ఉండటం లేదు. చికిత్స కోసం పలు జిల్లాల నుంచి జీజీహెచ్‌కు వస్తున్న పేద రోగులు జీజీహెచ్‌లో మందులు అందుబాటులో లేకపోవడంతో బయట కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో రక్తం కూడా జీజీహెచ్‌లో లభించక బయట బ్లడ్ బ్యాంకుల నుంచి రోగులతో కొనుగోలు చేయిస్తున్నారు. జీజీహెచ్ బ్లడ్‌బ్యాంక్‌పై పర్యవేక్షణ లోపించిందని, అందువల్లే రోగులు సకాలంలో బ్లడ్ లభించక బయట బ్లడ్ బ్యాంకులను ఆశ్రయించాల్సి వస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.


