‘సత్తెనపల్లికి చెందిన సునీత గుంటూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉద్యోగం చేస్తూ, స్థానికంగా ఉన్న ఒక బీఈడీ కళాశాలలో చేరింది. రోజూ కళాశాలకు వెళ్లకుండా, రికార్డులు మరొకరితో రాయించి కళాశాలలో సబ్మిట్ చేస్తోంది. కేవలం పరీక్షలు రాసి సర్టిఫికెట్ పొందేలా ప్లాన్ చేసుకుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందేందుకు, తగిన హాజరు వేసే విధంగా కళాశాల యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకుంది.’ ఇటువంటి వారికి చెక్ పెట్టేలా విద్యాశాఖ ఫేషియల్ అటెండెన్స్ తీసుకురానుంది.
బోగస్ హాజరుకు చెక్
జిల్లాలోని కొన్ని ప్రైవేటు కళాశాల్లో విద్యార్థులు హాజరు కాకపోయినా హాజరైనట్లు చూపుతూ వారి నుంచి కొంత డబ్బు తీసుకుంటున్నారు. ముఖ ఆధారిత హాజరుతో ఇకపై వీరి ఆటలు సాగవు. అలాగే కొందరు ఇన్ సర్వీసు ఉపాధ్యాయులు బీఈడీ, బీపీఈడీ తదితర కోర్సుల పేరుతో స్టడీ లీవ్ పెట్టి ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో సైతం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం తీసుకురావడంతో ఇకపై ఇటువంటి వారు కాలేజీకి డుమ్మా కొట్టేందుకు అవకాశం లేదు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ముడి
ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా బీటెక్, ఫార్మసీ, డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వం నుంచి ఫీజులు పొందాలంటే ఖచ్ఛితంగా రెగ్యులర్‌గా కళాశాలకు వెళ్లాల్సిందే. నిబంధనల ప్రకారం 75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కన్వీనర్ కోటాలో ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు వచ్చే విద్యాసంవత్సరం నుంచి రెగ్యులర్‌గా కళాశాలకు వెళ్లడంతో పాటు ఫేషియల్ అటెండెన్స్ నమోదు చేయాల్సి ఉంది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఇప్పటికే అమలు చేస్తున్న ఉన్నత విద్యాశాఖ ఉమ్మడి జిల్లాలో డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఈడీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు హాజరు ఆధారంగానే ఫీజు రీయింబర్స్‌మెంట్
ప్రభుత్వ
కళాశాలల్లో అమల్లో
ఉంది
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులతో పాటు విద్యార్థులకు ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రైవేటు కళాశాలల్లోనూ దీనిని ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపట్టింది. తద్వారా విద్యావ్యవస్థలో జవాబుదారీ తనం పెరుగుతుంది.
– డాక్టర్ వీఆర్ జ్యోత్స్న కుమారి,
ప్రిన్సిపాల్, మహిళా కళాశాల, గుంటూరు
విద్యార్థులకూ ముఖ ఆధారిత హాజరు
గుంటూరు ఎడ్యుకేషన్: వేర్వేరు ఉద్యోగాలు చేస్తూ, ఖాళీ సమయంలో కళాశాలకు వెళ్లకుండా ఉండడం, ఇష్టమొచ్చినప్పుడు కళాశాలలో బోధన చేయడం, కళాశాల ముఖమే చూడకుండా కేవలం సర్టిఫికెట్ల కోసమే కోర్సులు పూర్తి చేస్తున్నవారు కోకొల్లలు. ఇటువంటి వారికి చెక్ పెడుతూ ఉన్నతవిద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోజూ రెండుసార్లు ముఖ ఆధారిత హాజరు (ఫేషియల్ అటెండెన్స్) నమోదు చేసే విధంగా మార్గదర్శకాలు విడుదల చేసింది.
డిగ్రీ కళాశాలల్లో ఇప్పటికే అమలు
ప్రైవేటులోనూ అమలుకు రంగం సిద్ధం


