జూన్‌ ఒకటి నుంచి ధరల పెంపుపై ఆందోళన | - | Sakshi
Sakshi News home page

జూన్‌ ఒకటి నుంచి ధరల పెంపుపై ఆందోళన

May 31 2026 1:24 AM | Updated on May 31 2026 1:24 AM

వామపక్ష పార్టీల నాయకుల వెల్లడి

లక్ష్మీపురం: పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జూన్‌ ఒకటి నుంచి 9వ తేదీ వరకు ఆందోళన నిర్వహించనున్నట్లు వామపక్ష పార్టీలు వెల్లడించాయి. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో వామపక్షాల సమావేశం శనివారం నిర్వహించారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, సీపీఐ నగర కార్యదర్శి ఎ.అరుణ్‌కుమార్‌, సీపీఐ(ఎంఎల్‌) నాయకులు యు.నాగేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్‌) రెడ్‌స్టార్‌ రాష్ట్ర నాయకులు మన్నవ హరిప్రసాద్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు వి.నరసింహారావు, సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపోరు నాయకులు పి.కొటేశ్వరరావు, ఎం.సీపీఐ(యూ) నాయకురాలు డి.నాగలక్ష్మి విలేకరులలో మాట్లాడారు. జూన్‌ ఒకటి నుంచి 7వ తేదీ వరకు ప్రచారం నిర్వహించాలని, అనంతరం 9వ తేదీన రాస్తారోకో చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో కరపత్రాలను ప్రజల్లో విస్తృతంగా పంపిణీ చేయాలని, 4వ తేదీన గుంటూరులో సదస్సు నిర్వహించాలని, 9వ తేదీన జరిగే రాస్తారోకో పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం నాయకులు పాశం రామారావు, కె.నళినీకాంత్‌, ఈమని అప్పారావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement