జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు సంభవించకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో ఫైర్ ఆడిట్ సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎం.శ్రీనివాసరెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి, ఎన్.టి.ఆర్. వైద్య సేవ జిల్లా సమన్వయ అధికారి విజయ్‌శేఖర్ పాల్గొన్నారు.
● వేసవి సెలవుల నేపథ్యంలో నీటి గుంటలు, ఊబి ప్రదేశాల వద్ద ప్రజలు, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.


