ఘనంగా మోదుగుల జన్మదిన వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా మోదుగుల జన్మదిన వేడుకలు

May 29 2026 2:25 AM | Updated on May 29 2026 2:25 AM

ఘనంగా మోదుగుల జన్మదిన వేడుకలు

తాడికొండ: మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. గుంటూరు మల్లికార్జునపేటలోని వైఎస్సార్‌ సీపీ తాడికొండ నియోజకవర్గ కార్యాలయంలో మోదుగుల కేక్‌ కట్‌ చేశారు. ఆయనకు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నాయకులు పోతిన మహేష్‌, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి యేసురత్నం, మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌, సమన్వయకర్తలు వనమా బాలవజ్రబాబు, అంబటి మురళీకృష్ణ, బలసాని కిరణ్‌కుమార్‌, నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement