పేదల సొంతింటి కల.. కల్లే! | - | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కల.. కల్లే!

May 28 2026 1:46 AM | Updated on May 28 2026 1:46 AM

పేదల సొంతింటి కల.. కల్లే! తెనాలి: రాష్ట్రంలో అర్హులైన పేదలందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావించారు. పట్టణ గోలిడొంక, నేలపాడు, బుర్రిపాలెం, పెదరావూరు, జగ్గడిగుంటపాలెం, సిరిపురంలో దీనికోసం భూ సేకరణ చేశారు. పట్టణంలోని 19 వేల మంది పేదలకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. తొలి విడతలో ఇళ్ల నిర్మాణాలకు 9,907 మందిని ఎంపిక చేశారు. వీరిలో 8,120 మంది మాత్రమే ఇంటి నిర్మాణానికి ముందుకొచ్చారు. కొందరు లబ్ధిదారులు ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని కోరటంతో మూడు ఆప్షన్లను ప్రభుత్వం సూచించింది. పూర్తిగా లబ్ధిదారుడు గృహాన్ని నిర్మించుకోవటం మొదటి ఆప్షన్‌. ప్రభుత్వం దీనికోసం రూ.1.80 లక్షలు వారి బ్యాంక్‌ ఖాతాలో జమ చేసింది. రెండో ఆప్షన్‌లో ఇనుము, సిమెంట్‌తోపాటు రూ.1.20 లక్షల నగదు ఇవ్వటం. కాంట్రాక్టర్‌ ద్వారా ఇంటిని నిర్మించి ఇవ్వటం మూడో ఆప్షన్‌. లబ్ధిదారులు వారికి నచ్చినట్లు ఎంచుకుని నిర్మాణాలు ప్రారంభించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటివరకు ప్రక్రియ శరవేగంగా సాగింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇళ్ల నిర్మాణాల్లో పలు అవాంతరాలు ఏర్పడటంతో నత్తనడకన సాగుతూ వస్తున్నాయి. మొదట్లో బుసక, ఇసుక లభ్యత లేక కొన్ని నెలలు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. పనులను పునఃప్రారంభించిన తర్వాత బిల్లుల చెల్లింపులు మందకొడిగా జరగటంతో ఒకడుగు ముందుకు రెండగులు వెనక్కి అనే చందాన జరుగుతూ వచ్చాయి. తెనాలి పట్టణ పరిధిలో ప్రస్తుతం కేవలం 1,048 ఇళ్లు మాత్రమే పూర్తి అయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. నియోజకవర్గంలో పనిచేస్తున్న అధికారుల్లో ఆది నుంచి అలసత్వం ఉందనే విమర్శలు వస్తున్నాయి. మూడో ఆప్షన్‌ కింద ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు వంద ఇళ్ల చొప్పున అప్పగించి వాటిని పూర్తి చేసిన తర్వాత మిగిలినవి అప్పగిస్తే బాగుండేది. సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఒక్కో కాంట్రాక్టర్‌కు సగటున 300 నుంచి రెండు వేల ఇళ్ల వరకు అప్పగించి మ్యాపింగ్‌ చేశారు. దీంతో కాంట్రాక్టర్లు తమ వద్ద ఉన్న నగదును బేస్‌మెంట్‌ నిర్మించేందుకు ఉపయోగించారు. వాటిలో కొన్ని పూర్తికాగా మరికొన్ని అసంపూర్తిగా మిగిలిపోయాయి. మూడో ఆప్షన్‌ కింద ఇల్లు నిర్మించే పేదలకు 2022లో ప్రభుత్వం రూ.15వేల నగదును లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలో జమ చేసింది. చాలామంది లబ్ధిదారులు ఆ డబ్బులను సొంత అవసరాలకు ఉపయోగించుకున్నారు. ఆ మొత్తాన్ని నేటికీ అధికారులు వసూలు చేసి కాంట్రాక్టర్లకు అందజేయలేదు. పైగా ఆ డబ్బుల్ని కూడా కాంట్రాక్టర్లకు ఇచ్చినట్టు చూపారు. అదేమని ప్రశ్నిస్తే లబ్ధిదారుల నుంచి నగదు వసూలు చేసి ఇస్తామని కాంట్రాక్టర్లకు చెప్పినా తర్వాత పట్టించుకోలేదు. జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మాణాలకు ఎంపికై న స్వయం సహాయక సంఘ సభ్యులకు పిల్లర్స్‌తో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికారులు భావించారు. అయిదు పిల్లర్లకు రూ.35 వేలు, తొమ్మిది పిల్లర్లకు రూ.50 వేలు అదనంగా ఖర్చు అవుతుందని లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన దాదాపు రూ.8 కోట్ల నగదును హౌసింగ్‌ డీఈఈ, మెప్మా సీఎంఎంల జాయింట్‌ బ్యాంక్‌ అకౌంట్‌లో జమ చేశారు. వాటిలో కొంత నగదును కాంట్రాక్టర్లకు అడ్వాన్స్‌గా ఇచ్చారు. మిగిలిన నగదు ఏమైందో ఎవరికీ తెలియటం లేదు. తర్వాత అధికారులు మారిపోయారు. ఇళ్ల నిర్మాణంలో గందరగోళానికి ఇది కూడా ఓ కారణం. లబ్ధిదారులకు ప్రభుత్వం పీఎఫ్‌ఎంఎస్‌ కోడ్‌ను ఏర్పాటు చేసి నిర్మాణాలు పూర్తి చేయగానే విడతల వారీగా కోడ్‌ ద్వారా చెల్లింపులు జరుపుతారు. కొందరు లబ్ధిదారులకు పీఎఫ్‌ఎంఎస్‌ కోడ్‌ ఏర్పాటు చేయకపోవటం వల్ల నిర్మాణాలు పూర్తి చేసినప్పటికీ నేటికీ నగదు జమ కాలేదని చెబుతున్నారు. కాలనీల్లో బేస్‌మెంట్‌ పూర్తి కాగానే బుసక/మట్టితో నింపాల్సి ఉంది. అధికారులు సరఫరా చేస్తే రవాణా ఖర్చులను కాంట్రాక్టర్లు భరించాల్సి ఉంది. అధికారులు ఇప్పటి వరకు వాటిని సరఫరా చేయనేలేదు. బేస్‌మెంట్‌ మెరక నింపితేనే బిల్లు చెల్లిస్తామని ఉన్నతాఽధికారులు ప్రకటించారు. బుసక/మట్టిని సమకూర్చాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. చేసిన నిర్మాణాలకు సైతం బిల్లుల చెల్లింపులు 8 నెలల నుంచి నిలిపివేశారని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరికి బిల్లులు ఇచ్చారని కూడా చెబుతున్నారు. అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల కొందరు కాంట్రాక్టర్లకు సుమారు రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల నగదు ఆగిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జగనన్న కాలనీ గృహ నిర్మాణాల్లో గందరగోళం ఆగిపోయిన పేదల ఇళ్ల పనులు బుసక/మట్టి సరఫరా చేయని అధికారులు అవి లేకుండా పనులు ఎలా చేయాలంటున్న కాంట్రాక్టర్లు నెలలుగా నిలిచిపోయిన బిల్లుల చెల్లింపు

పేదల సొంతింటి కలకు చంద్రగ్రహణం పట్టింది. నియోజకవర్గ పరిధిలోని జగనన్న కాలనీల్లోని పేదల ఇళ్ల నిర్మాణాల్లో గందరగోళం నెలకొంది. అధికారులు కాంట్రాక్టర్లపై పలు ఆరోపణలు చేస్తూ బిల్లుల చెల్లింపులు నిలిపివేస్తే... కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన నగదు సంగతి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. బిల్లులు చెల్లిస్తే నిర్మాణాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు, అఽధికారుల మధ్య సమన్వయ లోపమే ఈ పరిస్థితికి దారితీసింది. పట్టించుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేయడంతో అంతిమంగా లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఇప్పుడు అంతే సంగతులు

ఆది నుంచి అధికారుల అలసత్వం...

జమ చేసిన ఈ నగదు సంగతేంటి...

మట్టి నింపితేనే బిల్లుల చెల్లింపులు

పిచ్చిమొక్కలతో నిండిన ఇంటి నిర్మాణ ప్రాంతం

Advertisement
 
Advertisement
Advertisement