గంజాయి విక్రయిస్తున్న మహిళ అరెస్టు
పెనమలూరు: గంజాయి విక్రయిస్తున్న మహిళ బుధవారం యనమలకుదురులో పట్టుబడింది. పెనమలూరు సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. యనమలకుదురు జన్మభూమి వంతెన వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న స్కూటీపై వెళ్తున్న తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన చదల జ్యోతిని ఆపారు. స్కూటీలో గుర్తించిన 1.95 కేజీల గంజాయిని స్వాధీం చేసుకొని వాహనం సీజ్ చేశారు. ఆమె కొద్దికాలంగా యనమలకుదురులో గది అద్దెకు తీసుకొని ఉంటుంది. ఆమె నర్సీపట్నానికి చెందిన రవి అనే వ్యక్తి నుంచి 6 కేజీల గంజాయి కొని చిన్న పొట్లాలుగా కట్టి విజయవాడ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్టు తెలిసింది. నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
వృద్ధురాలిపై లైంగిక దాడి వేమూరు: వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం.. వేమూరు మండలంలోని చావలి గ్రామానికి చెందిన వృద్ధురాలు(80) పూరిల్లులో ఉంటోంది. వేసవి కావడంతో మంచం ఇంటి ముందు వేసుకొని నిద్రిస్తోంది. ఈ నెల 25వ తేదీన సాయంత్రం 8 గంటలకు, అదే గ్రామంలోని దళితవాడకు చెందిన చావలి ఆనందబాబు(40) డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. డబ్బులు లేవని చెప్పడంతో నోటిలో గుడ్డలు పెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బుధవారం ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. వడగాడ్పులకు శతాధిక వృద్ధురాలి మృతి బాలికపై దాడి.. కేసు నమోదు
చేబ్రోలు: కొద్ది రోజులుగా వీస్తున్న వడగాడ్పులకు శతాధిక వృద్ధురాలు మృతి చెందింది. వివరాలు.. మండలం వడ్లమూడి యాదవపాలేనికి చెందిన తోట బసవమ్మ(104) మంగళవారం రాత్రి మృతి చెందింది. మృతురాలు బసవమ్మకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వంద సంవత్సరాలు దాటినప్పటికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. నాలుగు రోజులుగా తీవ్రమైన ఎండ, వడగాడ్పులకు అస్వస్థతకు గురైంది. స్థానిక పెద్దలు, బంధువులు మృతదేహానికి నివాళులర్పించారు.
అమరావతి: మద్యం మత్తులో ఓ బాలుడు బాలికపై దాడి చేసిన ఘటన అమరావతి గ్రామంలోని పల్లపు వీధిలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని లేమల్లె గ్రామానికి చెందిన మైనర్ బాలుడు మత్తులో ఉండి బుధవారం రాత్రి పల్లపువీధిలో ఇంటి బయట ఆడుకుంటున్న మైనర్ బాలికపై దాడికి పాల్పడ్డాడు. ఈదాడిలో బాలికకు పలుచోట్ల గాయాలు కావటంతో స్థానికులు మైనర్ బాలుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన బాలిక స్థానిక కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో చికిత్స పొందుతుంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వై.అచ్చియ్య తెలిపారు.