పీఏసీఎస్‌లు బలోపేతం కావాలి | - | Sakshi
Sakshi News home page

పీఏసీఎస్‌లు బలోపేతం కావాలి

May 27 2026 6:20 AM | Updated on May 27 2026 6:20 AM

పీఏసీఎస్‌లు బలోపేతం కావాలి

జిల్లా కలెక్టర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మ

గుంటూరు వెస్ట్‌: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పి.ఏ.సి.ఎస్‌) బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మ అన్నారు. సహకార శాఖ కార్యకలాపాలపై మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ బహుళ ప్రయోజనాల గిడ్డంగులను ఉపయుక్తంగా వినియోగించాలన్నారు. రైతులు ప్రయోజనం పొందాలని, పీఎసీఎస్‌లకు లాభసాటిగా ఉండాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎం.పద్మావతి,జిల్లా సహకార అధికారి వీరయ్య, డీఎస్‌ఓ పి.కోమలి పద్మ, నాబార్డు డి.డి.ఓ శరత్‌, తదితరులు పాల్గొన్నారు.

రీ సర్వేపై స్పందన మెరుగుపడాలి

జిల్లాలో రీ సర్వేపై పౌరుల స్పందన మరింత మెరుగుపడాలని జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేశారు. తహసీల్దార్లు, సర్వేయర్‌లు, వీఆర్వోలతో రీ సర్వే అంశాలపైన, ప్రజల స్పందనపైనా స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్‌ సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఫిర్యాదుదారు అర్జీని తిరస్కరిస్తే దానికి కారణాలు వీఆర్వో వివరించాలన్నారు.

ఎస్‌ఐఆర్‌ను పక్కాగా చేపట్టాలి

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌.ఐ.ఆర్‌.)ను జిల్లాలో పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌, ఎన్నికల ప్రధాన అధికారి వివేక్‌ యాదవ్‌ జిల్లా కలెక్టర్‌లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎస్‌.ఐ.ఆర్‌ చేపట్టడంపై సూచనలు, మార్గదర్శకాలు అందజేశారు. అనంతరం కలెక్టర్‌ సహాయ ఓటరు నమోదు అధికారులతో సమావేశం నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement