రోహిణి కార్తెలో ఇల్లే పదిలం | - | Sakshi
Sakshi News home page

రోహిణి కార్తెలో ఇల్లే పదిలం

May 27 2026 6:20 AM | Updated on May 27 2026 6:20 AM

ప్రత్యేకంగా పడకలు ఏర్పాటు

రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కొద్దిపాటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే వడదెబ్బతో ప్రాణాలు పోయే ప్రమాదం జిల్లాలో నమోదవుతున్న వడదెబ్బ మరణాలు

ప్రథమ చికిత్స ఇలా...

వడదెబ్బను ఇలా గుర్తించండి....

మానవ శరీరంలో ఐదు లీటర్ల మేరకు నీరు ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలు(98.6 ఫారెన్‌హీ హీట్‌). బయటి వాతావరణంలో ఉష్ణోగ్రత 37 డిగ్రీలు దాటినప్పుడు మన శరీరం ఎండ ప్రభావానికి లోనవుతుంది. అప్పుడు ఉక్కపోతగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో శరీరం చల్లబడేందుకు అసంకల్పిత ప్రతీకార చర్యగా శరీరంలోని నీరు బయటకు వచ్చి సమతా స్థితిని చేరుకుంటుంది. చెమట బయటకు రాకున్నా శరీరంలోని నీరు స్వేద గ్రంథుల ద్వారా ఆవిరి అవుతూనే ఉంటాయి. దీనిని మనం గుర్తించలేం. ఇలా బయటకు వెళ్లిన నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయాల్సిందే. ఆలస్యమయ్యే కొద్దీ జీవక్రియలు మందగిస్తాయి.

వడదెబ్బ లక్షణాలు..

తలనొప్పి. తలతిరగటం. శరీరంలో నీరు అంతా పోతుంది. ఎండిపోయిన చర్మంతో ఎక్కువ జ్వరం కలిగి ఉండటం. మత్తు నిద్ర. కలవరింతలు. జ్వరం 106 డిగ్రీలు దాటగానే ఫిట్స్‌ వస్తాయి. దాని ద్వారా పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. బీపీ పూర్తిగా తగ్గిపోతుంది. బ్రెయిన్‌, కిడ్నీ ఫెయిల్‌ అవుతాయి, మూత్రం స్తంభించి ప్రాణాలు పోతాయి.

వడదెబ్బ తగలకుండా ఉండాలంటే...

1.సాధ్యమైనంత వరకు మిట్ట మధ్యాహ్నం ఎండలో తిరుగకుండా జాగ్రత్త వహించాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లలోనే ఉండటం ఉత్తమం.

2.తప్పని సరిగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితులలో ఉప్పు కలిపిన మజ్జిగ, లేదా ఉప్పు కలిపిన పళ్లరసాలు, చల్లని నిమ్మరసం, కొబ్బరి నీరు, మంచినీరు తాగాలి.

3.వేసవి కాలంలో తెల్లని దుస్తులు ధరించాలి. బాగా వదులుగా ఉండే కాటన్‌ వస్త్రాలు ధరిస్తే మంచిది.

4.నల్లని వస్త్రాలు ధరించకూడదు.

5.ఇంటి గదుల ఉష్ణోగ్రతను తగ్గించేందుకు కిటికీలకు, తలుపులకు తెరలను వాడి, వేడిని తగ్గించవచ్చు. ఫ్యాన్లు, ఎయిర్‌కూలర్లు, ఎయిర్‌ కండీషనర్లు వాడాలి.

6. శీతలంగా ఉన్న ప్రదేశాలలో ఉండేందుకు ప్రయత్నించాలి.

7. వేడిగా ఉన్న రోజులలో తప్పని సరిగా గొడుగు, నెత్తికి టోపీ వాడాలి.

8. నెత్తికి టోపీ లేదా రుమాలు కట్టుకోవటం చేయాలి.

9. శరీరం నుండి చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటకు పోతుంది. కాబట్టి సాధ్యమైనంత మేరకు మంచినీరు ఎక్కువగా తాగాలి. కనీసం ఐదు లీటర్లు నీటిని తాగితే మంచిది.

10.ఎండలో పొలం పనులకు వెళ్లకూడదు. ఒకవేళ ఏమైన పనులు చేయాల్సి వస్తే ఉదయం, సాయంత్రం వేళల్లో చేయాలి.

వేసవి ఎండలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులను, వైద్య సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాం. ప్రతి పీహెచ్‌సీలో సన్‌స్ట్రోక్‌ బాధితులకు మెరుగైన వైద్యసేవల కోసం రెండు పడకలు ప్రత్యేకంగా కేటాయించారు. గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎండ ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశాం. వడదెబ్బ బాధితులకు వైద్యం అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాల్లో, చలివేంద్రాల్లో, ఆశాలు, అంగన్‌వాడీ కార్యకర్తల వద్ద ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఐవీ ప్లూయీడ్స్‌, యాంటి డయేరియల్‌ మందులు అందుబాటులో ఉంచాం.

–డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి,

జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి

రోహిణి ... రోకళ్ల పోటు ...

ఆకురాలు కాలం చివరి గీతం

అంటూ ఓ కవి చెప్పినట్లు సోమవారం నుంచి రోహిణి కార్తె సెగ తగులుతోంది. వేడి గాలులు వీస్తున్నాయి. ఉక్కపోత మనుషులను అతలాకుతలం చేస్తున్నాయి. అక్కడక్కడ వడదెబ్బ మరణాలు నమోదవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోద అయ్యాయి. రోహిణి కార్తెలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రోహిణి కార్తెలో ఇల్లే శ్రీరామరక్ష అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి అత్యవసరమైతే తప్ప, ఇంట్లో నుంచి బయటకు రావద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. –గుంటూరు మెడికల్‌

వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడగల ప్రదేశానికి చేర్చాలి. అతని శరీరంపై ఉండే దుస్తులను తొలగించి చల్లని నీటితో కడగటం కానీ, చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడవటం చేయాలి. ఐస్‌ ముక్కలను గుడ్డతో ఉంచి శరీరం అంతా అద్దితే చాలా మంచిది. శరీరం అంతా చల్లని గాలి తగిలేలా చూడాలి. రోగగ్రస్తులకు చల్లని నీరు లేదా ఉప్పు మరియు ఇతర లవణాలు కలిపిన నీటిని తాగించాలి. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు తాగించకూడదు. అయితే ఇవ్వన్నీ బాధితునికి డాక్టర్‌కి చూపించేలోగా చేయాల్సిన చర్యలు. స్ప్రుహకోల్పోతే మాత్రం సమయం వృథా చేయకుండా వైద్య సహాయం అందే ఏర్పాటు చేయాలి. – డాక్టర్‌ నరేంద్ర వెంకటరమణ,

సీనియర్‌ ఫిజీషియన్‌, గుంటూరు.

Advertisement
 
Advertisement
Advertisement