గజిబిజి గందరగోళం | - | Sakshi
Sakshi News home page

గజిబిజి గందరగోళం

May 26 2026 3:08 AM | Updated on May 26 2026 3:08 AM

ఈ నెల 19వ తేదీన డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ విడుదల చేసిన నగరపాలక సంస్థ అధికారులు పూర్తయిన అభ్యంతరాల స్వీకరణ మొత్తం 134 వినతులు రాక 21 సవరణలు సూచించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ

అర్ధంపర్ధం లేకుండా డివిజన్ల పునర్విభజన

70వ డివిజన్‌

ప్రతిపాదిత 70వ డివిజన్‌లో జానీ కాలనీ డోర్‌ నం.32–58 నుంచి 32–21–1877 వరకు, 32–60 నుంచి 32–78 వరకు, కాకుమానువారితోట 32–38 నుంచి 32–56 వరకు పక్క డివిజన్‌ 69లోకి వెళుతున్నాయి. వీటిని 70వ డివిజన్‌లోనే కొనసాగించాలి.

71వ డివిజన్‌

ప్రతిపాదిత 71వ డివిజన్‌లో సంజీవయ్యనగర్‌ 1, 2, 3 లైన్లు, గత 40 సంవత్సరాలుగా 53వ డివిజన్‌లో ఉన్నాయి. వీటిని ఇప్పుడు పక్క డివిజన్‌లోకి మార్పు చేస్తున్నారు. తిరిగి వాటిని 71 డివిజన్‌లోనే కొనసాగించాలి.

72వ డివిజన్‌

ప్రతిపాదిత 72వ డివిజన్‌లో గతంలో ఒకే ఒక్క గవర్నమెంట్‌ హైస్కూల్‌(డాక్టర్‌ పినపాటి ప్రభుదాస్‌ హై స్కూల్‌) ఉండేది. సుమారు 30 సంవత్సరాల నుంచి ఈ డివిజన్‌లోనే స్కూల్‌ ఉండేది. ఇప్పుడు పక్క డివిజన్‌లోకి వెళ్లింది. సదరు స్కూల్‌ను 72వ డివిజన్‌లోనే కొనసాగించడంతో పాటు ఎన్టీఆర్‌ కాలనీలోని 4 లైన్లు ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందినవి కాబట్టి వాటిని తొలగించాలి. వీటితోపాటు, మరికొన్ని డివిజన్‌లలో మార్పులు, చేర్పులు చేయాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ మాజీ కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులు, కార్యకర్తలు అభ్యంతరాలు అందజేశారు.

నెహ్రూనగర్‌: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 57 డివిజన్లను 76 డివిజన్లకు పెంచుతూ ఈ నెల 19వ తేదీన నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరాలను ఈ నెల 24వ తేదీలోగా అందజేయాలని సూచించడంతో నగరంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, నగర ప్రజలు మొత్తం 134 అభ్యంతరాలు తెలియజేశారు. ఇందులో వైఎస్సార్‌ సీపీ 21 అభ్యంతరాలను తెలిపింది. అంటే డివిజన్ల పునర్విభజన ప్రక్రియం ఎంత గందరగోళంగా జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. పార్టీ నేతలు, ప్రజలు ఇచ్చిన అభ్యంతరాలను అధికారులు ఏ విధంగా పరిష్కారిస్తారో అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లేకుంటే యధావిధిగా ప్రతిపాదిత మ్యాపునే ఫైనల్‌ చేస్తారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్‌ సీపీ అభ్యంతరాలు ఇవే..

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర పార్టీ అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరి ఫాతిమా, మాజీ డిప్యూటీ మేయర్‌, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబులు డివిజన్ల పునర్విభజనపై పట్టణ ప్రణాళిక అధికారులను కలిసి 21 అభ్యంతరాలను తెలియజేశారు. సదరు డివిజన్‌ల ప్రక్రియను పునఃసమీక్షించాలని వారు కోరారు.

5వ డివిజన్‌

పాత 3వ డివిజన్‌, ప్రతిపాదిత 5వ డివిజన్‌ ఏకవారివీధి, కొసరాజువారివీధి, సోమవారివీధి, ఎన్నంవారివీధి, కట్టావారివీధి, చెన్నంవారివీధి, ఆంజనేస్వామి గుడిబజారు, యాదవబజారు, 1వలైను, మెయిన్‌రోడ్డు వాటి స్థానంలో ప్రగతి నగర్‌, బాలాజీనగర్‌ 4,5,6 లైనులు కలపాలి.

6వ డివిజన్‌

ప్రతిపాదిత 6వ డివిజన్‌లో సరిహద్దులు మారిపోయాయి. ఇందులో ఎస్సీల ఓట్లు చీలిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎస్సీ ఓట్లు కొన్ని పక్క వార్డు అయిన 5వ వార్డులోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఉన్న సోమవారి వీధిని తిరిగి ఇదే వార్డులో కొనసాగించాలి.

21వ డివిజన్‌

ప్రతిపాదిత 21వ డివిజన్‌లో కార్మికుల కాలనీని మార్చాలి. చాకలిగుంట, సుగాలికాలనీ మూడు లైనులు 19వ వార్డులోనే ఉంచాలి.

49వ డివిజన్‌

ప్రతిపాదిత 49వ డివిజన్‌లో గుజ్జనగుండ్ల, వైశ్యాబ్యాంకు కాలనీరోడ్డు, వెహికల్‌ బజారు, గుజ్జనగుండ్ల ఎస్సీ కాలనీ, 55వ డివిజన్‌లో కలిపారు. యధావిధిగా 49వ డివిజన్‌లో కలపాలి.

58వ డివిజన్‌

ప్రతిపాదిత 58వ డివిజన్‌లో ఓటర్ల సౌకర్యార్ధం బూత్‌ నంబరు దగ్గర్లో ఉన్న ఓటర్ల జాబితాను ప్రస్తుత సరిహద్దుల పాత వార్డు నంబరు 45 (58వ డివిజన్‌)లో కలపాలి.

9వ డివిజన్‌

ప్రతిపాదిత 9 డివిజన్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా రైలుపేటను రెండు ముక్కలుగా విడగొట్టారు. గతంలో వార్డుల విభజన చేసేటప్పుడు మెయిన్‌రోడ్డుని హద్దుగా తీసుకుని జరిగేది. 9వ డివిజన్‌లోనే మోటుపల్లి వారి వీధి, ఆర్య క్షత్రియ వారి వీధి, రైలుపేట 3వ లైను అంతర్‌భాగాలు డివిజన్‌లోనే కొనసాగించాలి.

14వ డివిజన్‌ :14, 15 డివిజన్లు రెండు ముక్కలుగా చీల్చారు. ఆనందపేట 4,5,6,7,8,9 లైనులు కలపాలి. కొండలరావునగర్‌, జానిత్యనగర్‌, యానాది కాలనీ కలపాలి. 15వ డివిజన్‌లో ఆనందపేట జీరోలైను నుంచి 3వలైను వరకు, ముగ్ధుంనగర్‌లో 1 నుంచి 6 లైనులు, ప్రియాంకగార్డెన్స్‌ 1 నుంచి 3 లైనుల వరకు, భగత్‌సింగ్‌ నగర్‌ 1నుంచి4లైన్లు, అసంవీధి 1,2లైనులు విజయశాంతినగర్‌, నాగలక్ష్మినగర్‌ కలపాలి.

Advertisement
 
Advertisement
Advertisement