జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ 148 అర్జీలు స్వీకరణ
నగరంపాలెం: పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, అధికారులకు సూచించారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ(డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. ఈ మేరకు బాధితుల నుంచి ఫిర్యాదులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వీకరించారు. బాధితుల మొరను ఆలకించారు. ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి, చట్టపరిధిలో బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా మెలగాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. బాధితుల నుంచి 148 వినతులను స్వీకరించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), బెల్లం శ్రీనివాస్ (ట్రాఫిక్), మధుసూదన్‌రావు (గుంటూరు సీసీఎస్)లు ఫిర్యాదులు స్వీకరించారు.


