పెదకాకాని: నాగారపమ్మ ఆలయంలో అమ్మవారి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని నంబూరు గ్రామ దేవత నాగారపమ్మ ఆలయంలో ఐదు రోజుల ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం అమ్మవారిని వైఎస్సార్ సీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి సతీమణి సజ్జల లక్ష్మి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నాగారపమ్మ వారికి సారె సమర్పించారు. అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి పూజా సామగ్రి సమర్పించారు. సజ్జల లక్ష్మికి వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి వుయ్యూరు సతీష్‌రెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ గ్రామ కన్వీనర్ భీమవరపు కృష్ణారెడ్డి, మందాళ శివారెడ్డి, మాజీ ఉప సర్పంచి వుయ్యూరు భవాని, వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు భీమవరపు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారికి సారె సమర్పించిన సజ్జల లక్ష్మి


