ఏకబిగిన 9 గంటలపాటు కొనసాగిన వైఎస్సార్‌ సీపీ రైతు నిరశన విజయవంతం | - | Sakshi
Sakshi News home page

ఏకబిగిన 9 గంటలపాటు కొనసాగిన వైఎస్సార్‌ సీపీ రైతు నిరశన విజయవంతం

Apr 26 2026 2:51 AM | Updated on Apr 26 2026 2:51 AM

ఏకబిగిన 9 గంటలపాటు కొనసాగిన వైఎస్సార్‌ సీపీ రైతు నిరశన విజయవంతం

బాబు హామీలు మేనిఫెస్టో దాటవు

కడుపు మండిన రైతన్న

జిల్లా వ్యాప్తంగా భారీగా తరలివచ్చిన

రైతులు, పార్టీ సమన్వయకర్తలు

జొన్న, మొక్కజొన్న పంటలను

మద్దతు ధరకు కొనుగోలు చేయాలని

పెద్ద పెట్టున నినాదాలు

పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల

నరేంద్రపై ఆగ్రహం వ్యక్తం చేసిన

దీక్ష సారథి, సమన్వయకర్త

అంబటి మురళీకృష్ణ

ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా

రైతులకు చేసిందేమీ లేదని

నరేంద్రపై మండిపాటు

మొక్కజొన్నకు మద్దతు ధర

రూ.2,400 ఉండగా, కొనుగోలు

కేంద్రాలు ప్రారంభించని ప్రభుత్వం

గుంటూరు ఎడ్యుకేషన్‌/గుంటూరు వెస్ట్‌: పంటలకు మద్దతు ధర కోసం వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన ‘మొక్కజొన్న రైతు పోరాట దీక్ష’ విజయవంతమైంది. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక, టీడీపీ సర్కారు సహాయ నిరాకరణతో కడుపు మండిన రైతులు వందలాదిగా పోరాట దీక్షకు తరలివచ్చారు.

● వ్యవసాయం దండగన్న చంద్రబాబు తీరుతో ఆరుగాలం శ్రమించి, దుక్కిదున్ని పండించిన పంటను కొనుగోలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరితో అప్పులపాలవుతున్న అన్నదాతలు వైఎస్సార్‌ సీసీ పోరాట దీక్ష వేదికగా తమ ఆవేదనను వెళ్లగక్కారు.

● వైఎస్సార్‌ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ సారధ్యంలో చేపట్టిన రైతు పోరాట దీక్ష మరో ప్రత్యామ్నాయం లేకుండా పంటలను పూర్తిస్థాయిలో మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయాల్సిందేనని ప్రభుత్వానికి అల్టిమేటం విధించింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున, గుంటూరు జిల్లా పరిశీలకులు పోతిన మహేష్‌, నియోజకవర్గ సమన్వయకర్తలు వరికూటి అశోక్‌బాబు, బలసాని కిరణ్‌కుమార్‌, అన్నాబత్తుని శివకుమార్‌ , పార్టీ నాయకులు నాగార్జున యాదవ్‌, నిమ్మకాయల రాజనారాయణ, గులాం రసూల్‌, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు పానుగంటి చైతన్య, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు దుర్గా ప్రసాద్‌, జిల్లా సోషల్‌ మీడియా అధ్యక్షులు కొరటిపాటి ప్రేమ్‌ కుమార్‌, ప్రచారం విభాగం అధ్యక్షులు దానం వినోద్‌, పట్టణ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి, పొన్నూరు టౌన్‌, రూరల్‌ అధ్యక్షులు షేక్‌ నాసర్‌, సీహెచ్‌ మురళి, చేబ్రోలు, పెదకాకాని అధ్యక్షులు ఆళ్ళ శ్రీరామ్‌ రెడ్డి, ముడియాల మల్లిఖార్జున రెడ్డి, జడ్పీటీసీ గోళ్ళ జ్యోతి, పెదకాకాని మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు, నియోజకవర్గ బూత్‌ కన్వీనర్‌ చాగంటి మురళీ కుమార్‌ రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఆకుల వెంకటేశ్వరరావు, రాష్ట్ర యూత్‌ విభాగం కార్యదర్శి అమరనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement