ఈ ప్రభుత్వ పాలనలో కౌలు రైతుల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర లేకపోగా కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. మొక్కజొన్న మద్దతు ధర రూ.2400 ఉంటే దళారులు మాత్రం రూ.1500–1600 మద్యలోనే కొనుగోలు చేస్తున్నారు. రైతుకు దిక్కుతోచని పరిస్థితిలో అమ్ముకుంటున్నారు.
– దొంతిరెడ్డి వేమారెడ్డి,
మంగళగిరి సమన్వయకర్త
మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రైతు పక్షపాతులు. గత ప్రభుత్వ హయాంలో 54 లక్షల మంది రైతులకు పంటల బీమా కింద జగన్ రూ.7200 కోట్లు వెచ్చించారు. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిన ఘనత గత ప్రభుత్వానిదే. రైతుల పట్ల తమ పార్టీకి ఉన్న నైతికతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర రైతులు, యువత మళ్ళీ జగన్ ముఖ్యమంత్రిగా రావాలని తమ కష్టాలను తీర్చాలని కోరుకుంటున్నారు.
– వనమా వజ్రబాబు, తాడికొండ సమన్వయకర్త
చంద్రబాబు నాయుడు హామీలన్నీ మేనిఫెస్టో దాటవు. రైతులు కుమిలిపోతుంటే ఈ ప్రభుత్వం ప్రతిపక్షాలను అణగదొక్కే ధోరణి అవలంబిస్తోంది. రైతులకు మద్దతు ధర కోసం న్యాయమైన, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తుంటే తప్పుడు కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. టీడీపీ పాలనలో అన్ని పార్టీలకు చెందిన రైతులు అవస్థలు పడుతున్నారు.
– నూరి ఫాతిమా,
గుంటూరు తూర్పు సమన్వయకర్త


