పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడున్న రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ నిలిచి పోరాటం చేస్తోంది. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మామిడి, పొగాకు, మిర్చి రైతుల కోసం వారి పక్షాన నిలిచి మనోధైర్యాన్ని ఇచ్చి, ప్రభుత్వం చేసే అరాచకాలని వెలుగులోకి తెచ్చారు. రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో నిలదీసే కార్యక్రమాన్ని తీసుకొని రోడ్డుపైకి వచ్చి ధర్నా చేసిన కార్యక్రమాలను చూశాం. రాష్ట్రంలో పేదవారికి సహాయం చేయాలనీ, వారిని ఆదుకోవాలని ఆలోచన చేయలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఈ సర్కారును ప్రజలు త్వరలో ఇంటికి పంపుతారు.
– సింహాద్రి రమేష్,
అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే
●


