కెనాల్‌ డ్రైనేజీలోకి దూసుకు వెళ్లిన కారు | - | Sakshi
Sakshi News home page

కెనాల్‌ డ్రైనేజీలోకి దూసుకు వెళ్లిన కారు

Apr 26 2026 2:51 AM | Updated on Apr 26 2026 2:51 AM

కెనాల్‌ డ్రైనేజీలోకి దూసుకు వెళ్లిన కారు జెడ్పీలో భేటీ అయిన స్థాయీ సంఘాలు

తాడేపల్లిరూరల్‌ : తాడేపల్లి పట్టణ పరిధిలోని భరతమాత సెంటర్‌ వద్ద బకింగ్‌హామ్‌ కెనాల్‌కు అనుసంధానంగా ఉన్న డ్రైనేజీలోకి ఓ కారు దూసుకు వెళ్లింది. శనివారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో కారు కాలువకు, డ్రైనేజీకి మధ్యలో మురుగునీటిలో కూరుకుపోయింది. కానిస్టేబుల్‌ ఒకరు ఉండవల్లి సెంటర్‌ నుంచి బైపాస్‌ వైపు కారులో అతివేగంగా వెళుతుండగా, భరత మాత సెంటర్‌ వద్ద కాంక్రీట్‌ దిమ్మను ఢీకొని 15 అడుగుల లోతులో కారు పడిపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. కారు బెలూన్స్‌ ఓపెన్‌ కావడంతో కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉమ్మడి గుంటూరు జెడ్పీ కార్యాలయంలో శనివారం స్థాయీ సంఘ సమావేశాలను నిర్వహించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా ఛాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రణాళిక–ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, పనులకు సంబంఽధించిన నాలుగు స్థాయీ సంఘ సమావేశాల అజెండాలపై చర్చించారు. చైర్‌పర్సన్‌ అధ్యక్షతన జరిగిన ఆయా సమావేశాల్లో సభ్యులుగా ఉన్న జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement