మంగళగిరి టౌన్ : గుంటూరు జిల్లా మంగళగిరిలో అదనంగా నిర్మించిన కోర్టును శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు న్యాయమూర్తులతో కలసి ప్రారంభించారు. తొలిరోజు నాలుగు కేసులను విచారించారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తులను మంగళగిరి బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. తొలుత హైకోర్టు న్యాయమూర్తులు మంగళగిరి కోర్టు ప్రాంగణంలోని న్యాయదేవతకు పూలమాలలు వేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డి. కృష్ణమోహన్, జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ వి. సుజాత, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, మంగళగిరి కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రియదర్శిని, జస్టిస్ సురేష్‌బాబు, గుంటూరు జిల్లా జడ్జి కల్యాణ చక్రవర్తి, గుంటూరు న్యాయమూర్తులు, మంగళగిరి బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.


