నిమ్మకాయల ధరలు
30న ప్రతిష్ఠా మహోత్సవం
కన్యకా పరమేశ్వరికి పూజలు
అంతం కాదు... ఆరంభం
మంత్రి సింగపూర్‌లో ఉన్నారు
ప్రతీకారమే ప్రభుత్వ లక్ష్యం
జగన్ వస్తేనే మంచిరోజులు..
ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
●
పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం కళ్లుండీ చూ డలేని కబోదిలా మా రింది. మొక్కజొన్నకు కేంద్ర ప్రకటించిన మద్దతు ధర ప్రకారం రూ.2,400కు కొనుగోలు చేయాల్సిన సర్కారు కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంతో దళారులకు రూ. 1200 నుంచి రూ.1400లకు అమ్ముకోవాల్సిన దుస్థితి. టీడీపీ నేతలు దళారులతో కుమ్మకై ్క తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నారు. పంటకు గిట్టుబాటు ధరలు లేవు.
– మేరుగ నాగార్జున, మాజీ మంత్రి
7
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5,000, గరిష్ట ధర రూ.9,600, మోడల్ ధర రూ.7,000 వరకు పలికింది.
ముప్పాళ్ళ: చాగంటివారిపాలెంలోని సుభద్రా బలభద్ర సహిత జగన్నాథస్వామి ఆలయంలో 30న శివాలయ ప్రతిష్ఠా మహోత్సవం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు.
పిడుగురాళ్ల: పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి జన్మదిన వేడుకలలో భాగంగా మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు.
మొక్కజొన్న ఽగిట్టుబాటు ధర కోసం అంబటి మురళీ కృష్ణ రగిలించిన పోరాట స్ఫూర్తికి ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర స్థాయి ఉద్యమంలా మార్చేస్తాం.చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులు కరవుతో అల్లాడిపోతారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో రైతుల కోసంరూ.3000 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఆదుకున్నారు. ఈ ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కూడా రైతులకు దక్కనివ్వడం లేదు.
– లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ
గుంటూరు జిల్లాలో కమర్షియల్, డొమెస్టిక్ పంటలు కలిసి దాదాపు 100 రకాల పండిస్తారు. ప్రభుత్వం ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించాల్సి పోయి రైతు కష్టాన్ని దళారుల పాలు చేస్తుంది. రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సింగపూర్‌లో షికార్లు కొడుతున్నారు. చంద్రబాబు నాయుడు రైతుల విషయంలో పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు.
– మోదుగుల వేణుగోపాలరెడ్డి,
మాజీ ఎంపీ, పార్టీ పరిశీలకులు
రాష్ట్ర ప్రభుత్వం పాలన గాలికొదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే పనిలో నిమగ్నమయ్యింది. దీనిలో భాగంగానే తమపై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందుతోంది. ఒక్క మొక్కజొన్నకే కాకుండా ఏ పంటకు కనీసం మద్దతు ధర లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో ప్రతి ఏడాది రైతుకు క్రమం తప్పకుండా న్యాయం జరిగేది, ఇప్పుడు ఆ లోటు వారికి తెలుస్తుంది.
– పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి,
వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు
కనీస మద్దతు ధరలేక, ప్రభుత్వ సాయం అందక ఇబ్బందులు పడుతున్న రైతులకు మళ్ళీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాకతో మంచి రోజులొస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం వద్ద మొక్క జొన్న కొనేందుకు డబ్బులు లేవనడం వారి చేతకాని తనానికి నిదర్శనం. టీడీపీ ప్రభుత్వ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న విషయం ప్రజలకు తెలీదనుకుంటున్నారా..?
– అంబటి రాంబాబు,
వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు,


