లక్ష్మీపురం: గుంటూరు నడిబోడ్డున ఉన్న ఎన్‌టీఆర్ స్టేడియంలో విద్యుత్ బిల్లు సకాలంలో చెల్లించక పోవడంతో అధికారులు రంగంలోకి దిగారు. బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్‌టీఆర్ స్టేడియం, శ్యామలానగర్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఫ్యూజులు తీసేయడంతో క్రీడాకారులు తీవ్ర అసౌకర్యాన్ని గురయ్యారు. తొలి నుంచీ క్రీడాకారుల జీవితాలతో చంద్రబాబు సర్కార్ ఆటలాడుతోంది. శుక్రవారం విద్యుత్ శాఖ అధికారులు ఫ్యూజులు తీయడంతో సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. శ్యామలానగర్‌లోని ఎన్‌టీఆర్ స్విమ్మింగ్ పూల్‌లో సాయంత్రం ఇలా చేయడంతో క్రీడాకారులుగా సభ్యత్వం ఉన్న వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే స్విమ్మింగ్ పూల్‌కు సకాలంలో నీటి సరఫరా అందడం లేదు. ఇప్పటికే నంబర్ షిప్‌కు రూ.50వేల చొప్పున సుమారు రూ.2 కోట్లు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకో రెండు వందల మందికి సభ్యత్వాలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వసతుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు.


