ఆస్తిపన్ను వసూళ్లలో గుంటూరుకు గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

ఆస్తిపన్ను వసూళ్లలో గుంటూరుకు గుర్తింపు

Apr 24 2026 10:40 AM | Updated on Apr 24 2026 10:40 AM

నెహ్రూనగర్‌: గుంటూరు నగరపాలక సంస్థ మరోసారి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభా పురస్కారాన్ని అందుకుంది. గురువారం విజయవాడలోని ది స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్స్‌లో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ రూల్స్‌ 2026 పై జరిగిన రాష్ట్ర స్థాయి కమిషనర్ల వర్క్‌ షాప్‌లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్ర స్థాయిలో గుంటూరు నగరపాలక సంస్థ అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌, సీడీఎంఏ సంపత్‌ కుమార్‌లు గుంటూరు నగర కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌కు ప్రశంసా పత్రం, షీల్డ్‌ అందించి అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఆస్తి పన్ను వసూళ్లలో 2026–27లో గత సంవత్సరంతో పోలిస్తే 5 శాతం రాయితీతో వసూళ్లలో జీఎంసీ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఇందులో నగరంలోని పన్ను చెల్లింపుదారులు చొరవతోపాటు రెవెన్యూ అధికారులు, ఇన్‌స్పెక్టర్లు కార్యదర్శుల కృషి ఉందని చెప్పారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement