రాష్ట్ర అథ్లెటిక్స్‌ పోటీల్లో జిల్లాకు పేరు తీసుకురావాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర అథ్లెటిక్స్‌ పోటీల్లో జిల్లాకు పేరు తీసుకురావాలి

Apr 24 2026 10:40 AM | Updated on Apr 24 2026 10:40 AM

జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్‌

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): రాష్ట్రస్థాయి అథ్లెటిక్‌ పోటీల్లో పతకాలు సాధించి గుంటూరు జిల్లాకు పేరు తీసుకురావాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అప్రోజ్‌ ఖాన్‌ అన్నారు. అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో బీఆర్‌ స్టేడియంలో గురువారం నిర్వహించిన జిల్లా సీనియర్‌ అథ్లెటిక్‌ ఎంపికల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎంపికల్లో జిల్లా నలుమూల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా జట్టు ఎంపిక చేసి మే నెలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో జరిగే ఏపీ స్టేట్‌ అథ్లెటిక్‌ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో శాప్‌ అథ్లెటిక్స్‌ కోచ్‌లు వెంకటేశ్వరరావు, శివారెడ్డి, జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం కార్యదర్శి జీవీఎస్‌ ప్రసాద్‌, సభ్యులు కే అరుణ్‌కుమార్‌, నాని తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement