ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌లు | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌లు

Apr 24 2026 10:40 AM | Updated on Apr 24 2026 10:40 AM

నగరంపాలెం: ఐపీఎల్‌కి సంబంధించి క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడే 15 మందిని లాలాపేట, పాతగుంటూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.2 లక్షలు, 13 సెల్‌ఫోన్లను సీజ్‌ చేశారు. నగరంపాలెం జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కేసుల వివరాలను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. ముందస్తు సమాచారంతో బుధవారం రాత్రి ఏటుకూర్‌రోడ్డు చాకలిగుంట ఒకటో వీధిలోని ఓ ఇంట్లో లాలాపేట పోలీసులు తనిఖీలు చేపట్టారు. మొబైల్‌ఫోన్లతో గ్రూప్‌లుగా క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని గుర్తించి, 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ బెట్టింగ్‌లో ఇస్లావత్‌ జయరామ్‌నాయక్‌ నిర్వాహాకుడు అని విచారణలో వెల్లడైందన్నారు. ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో లాగినై, అనంతరం మిగతా బెట్టింగ్‌ రాయుళ్లకు లాగిన్‌ సృష్టించి, ఇచ్చేవాడని చెప్పారు. వారిలో ఇస్లావత్‌ జయరామ్‌నాయక్‌, గుమనంపాటి రామారావు, తోట గీతవెంకటగోపీనాథ్‌, షేక్‌.చిన్న జిన్నాసాహెబ్‌, పాలపర్తి గోపికృష్ణ, నేలకుర్తి నాగయ్య, భోగ్యం హనుమంతురావు, షేక్‌.షుకుర్‌, షేక్‌.నాగుల్‌మీరా, కుటాల వెంకట్‌, దార్ల కోటేశ్వరరావును అరెస్ట్‌ చేసి, పది సెల్‌ఫోన్లు, రూ.1.25 లక్షలు సీజ్‌ చేశామని చెప్పారు. అలాగే నందివెలుగురోడ్‌లో గురువారం చిన్నారి కిళ్లీ దుకాణంలో పాతగుంటూరు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో షేక్‌.రియాజ్‌, సుర చిన్నకేశవులు అలియాస్‌ చిన్నారి, తుమ్మూరు రవీంద్రనాధ్‌కుమార్‌రెడ్డి అలియాస్‌ రవి, బల్ల వెంకటేశ్వరరెడ్డిలను అరెస్ట్‌ చేసి, రూ.75 వేలు, మూడు సెల్‌ఫోన్లు, ఒక బుక్‌ స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లకు సంబంధించి ఓవర్‌కు ఎన్ని పరుగులు తీస్తారనే అంశాలపై ఫ్యాన్సీ బెట్టింగ్‌లు నిర్వహించేవారని అన్నారు. విద్యానగర్‌లో ఉంటున్న రియాజ్‌ బెట్టింగ్‌ నిర్వహకుడని, అతని ద్వారా చిన్నకేశవులు, రవీంద్రనాధ్‌, బల్ల వెంకటేశ్వరరెడ్డిలు బెట్టింగ్‌లు వేస్తారని చెప్పారు. ఈ కేసులు చేధించిన తూర్పు డీఎస్పీ షేక్‌. అబ్దుల్‌అజీజ్‌, సీఐలు ఏవీ.శివప్రసాద్‌ (లాలాపేట పీఎస్‌), కె.వెంకటప్రసాద్‌ (పాతగుంటూరు పీఎస్‌), ఎస్‌ఐలు షేక్‌.హసీం, అబ్దుల్‌రెహమాన్‌, కానిస్టేబుళ్లు కిరణ్‌కుమార్‌, పి.శంకర్‌, షేక్‌.మీరావలి, కె.బాబురావు, జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంస పత్రాలు అందించారు.

15 మంది అరెస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement