న్యూస్‌రీల్
ముందస్తు అనుమతులపై నిలదీత
రూ.లక్షలు కోల్పోయినా అదే తీరు...
అభ్యంతరం తెలిపిన వైఎస్సార్‌సీపీ
జెడ్పీటీసీ సభ్యులను అడ్డుకున్న
టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
జెడ్పీ సర్వసభ్య సమావేశానికి పక్కా వ్యూహంతో వచ్చిన టీడీపీ ప్రజాప్రతినిధులు
ముందస్తు అనుమతులపై వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు చేస్తున్న పోరాటంపై జెడ్పీ చైర్‌పర్సన్ అసహనం
రూ.32 కోట్ల స్టాంప్ డ్యూటీ సర్‌చార్జ్ నిధులు విడుదల చేయని బాబు సర్కారు
టీడీపీ ప్రజా ప్రతినిధుల అండతో ముందస్తు అనుమతులకు ఆమోదం
సమావేశం జరిగిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వైఎస్సార్ సీపీ సభ్యులు
ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ మొక్కజొన్న పంటకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా క్వింటా రూ.2,400 చొప్పున రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయకపోవడంతో దళారులు రూ.1,700కు కొంటున్నారని తెలిపారు.
ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ మొక్కజొన్న, పొగాకు పంటలను విస్తీర్ణానికి మించి పండిస్తే కొనుగోలు చేయడం ప్రభుత్వాలకు సాధ్యం కాదన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ రైతులను లాభదాయకమైన ఉద్యాన పంటల దిశగా ప్రోత్సహించాలని సూచించారు. కల్తీ విత్తనాలు, ఎరువులు విక్రయించిన వ్యాపారులపై తీసుకున్న చర్యల గురించి అధికారులను నిలదీశారు. క్రిమినల్ కేసులు నమోదు చేసి లైసెన్సులు రద్దు చేయాలన్నారు.
రొంపిచర్ల జెడ్పీటీసీ సభ్యుడు పిల్లి ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటికి కటకట మొదలైందన్నారు. నీటిని సరఫరా చేయలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు నింపాలన్నారు. యూరియా బస్తాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారని తెలిపారు. పంట కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. నరసరావుపేట ఆస్పత్రిలో గుండె వైద్య చికిత్స నిపుణులు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించాల్సి వస్తోందని చెప్పారు. ఈ లోపు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్లు ప్రస్తుత టీడీపీ సర్కారు నిర్లక్ష్యంతో మూలనపడ్డాయని తెలిపారు. మరమ్మతులు సైతం చేయించలేదన్నారు. పలు పాఠశాలల్లో ఆర్వో వాటర్ ప్లాంట్లను బిగించలేదని పేర్కొన్నారు.
పెదకూరపాడు జెడ్పీటీసీ సభ్యులు కంకణాల స్వర్ణకుమారి మాట్లాడుతూ గారపాడులో ఏళ్ల తరబడి స్థానిక అవసరాల కోసం వినియోగించుకుంటున్న భూమిని ప్రైవేటు పరిశ్రమకు కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నారని సమావేశం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా గ్రామస్తుల స్వాధీనంలో ఏళ్ల తరబడి ఉన్న భూమిని పరిశ్రమకు కేటాయించవద్దని గతంలో ప్రజలు జిల్లా కలెక్టర్‌కు విన్నవించారని అన్నారు. దీనిపై పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ.. గ్రామస్తుల అంగీకారంతోనే కేటాయిస్తున్నామని చెప్పారు. కానీ గ్రామస్తులు సిద్ధంగా లేరని స్వర్ణకుమారి స్పష్టం చేశారు.
గురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
పులిచింతల సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.4920 టీఎంసీలు. ప్రాజెక్టు సామర్థ్యం 45.77 టీఎంసీలు.
నిమ్మకాయల ధరలు
తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8,000, గరిష్ట ధర రూ.12,500, మోడల్ ధర రూ.10,000 వరకు పలికింది.
ఈవీఎం గోడౌన్ తనిఖీ
నరసరావుపేట: స్థానిక మార్కెట్ యార్డులో ఈవీఎం గోడౌన్‌ను పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టరు డాక్టర్ కృతికా శుక్లా బుధవారం తనిఖీ చేశారు.
సీఆర్డీఏ ఏసీగా బాధ్యతలు స్వీకరించిన కె.కార్తీక్
తాడికొండ: సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా కొల్లాబత్తుల కార్తీక్ బాధ్యతలు చేపట్టారు. రాయపూడిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం 3వ ఫ్లోర్‌లోని ఆయన చాంబర్‌లో బుధవారం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు తొలుత సీఆర్డీఏ కమ్యూనికేషన్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జి.రామరాజు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్తీక్‌కు కమిషనర్ వి.విజయ రామరాజు, అడిషనల్ కమిషనర్ ఎ.భార్గవ తేజ, ఆఫీస్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాసరావు, ఐటీ విభాగ డైరెక్టర్ బి. మల్లికార్జున రెడ్డి, ఇతర ముఖ్య అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
వ్యవసాయ అధికారుల సంఘం జిల్లా ప్రెసిడెంట్‌గా శైలజారాణి
కొరిటెపాడు(గుంటూరు) : గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం ప్రెసిడెంట్‌గా మంగళగిరి మండలం ఏఓ జంపని శైలజారాణి ఎన్నికయ్యారు. స్థానిక కృషీ భవన్‌లో బుధవారం జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా ప్రెసిడెంట్‌గా శైలజారాణితో పాటు వైస్ ప్రెసిడెంట్‌గా దుగ్గిరాల మండలం ఏఓ రాగాల విజయబాబు, జనరల్ సెక్రటరీగా పెదకాకాని ఏఓ కె.రమణకుమార్, జాయింట్ సెక్రటరీగా పి.సంధ్యారాణి, కోశాధికారిగా బి.కిశోర్‌లు ఎన్నికయ్యారు. నూతన కమిటీ మూడు సంవత్సరాల పాటు కొనసాగనుంది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.పద్మావతి, ఆత్మా ప్రాజెక్టు డైరెక్టర్ జి.వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం ప్రెసిడెంట్ బాల భాస్కర్, కార్యదర్శి బి.ప్రవీణ్, కోశాధికారి మురళీ కిషోర్‌ల ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అనంతరం నూతన సభ్యులను సత్కరించి, అభినందనలు తెలిపారు.
గుంటూరులో మోడల్ లా సెట్
గుంటూరు లీగల్: ఈ నెల 26వ తేదీన ఏపీ బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉచిత మోడల్ లా సెట్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో అఫీషియల్ రిసీవర్ పి.టి.కోటేశ్వరరావు, మాజీ గవర్నమెంట్ ప్లీడర్ పోకల వెంకటేశ్వర్లు, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ పీపీ పల్లపు కృష్ణ, గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ కొండవీటి శ్రీనివాసరావులు ఆవిష్కరించారు. న్యాయవాది పల్లపు కృష్ణ మాట్లాడుతూ గుంటూరు శ్యామలానగర్‌లో ఉన్న మాంటిస్సోరి ఇంగ్లిష్ మీడియం స్కూల్ లో ఆదివారం ఉదయం 10 గంటలకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు బార్ అసోసియేషన్ లైబ్రరీ సెక్రటరీ రాజేష్ లింగం, న్యాయవాదులు కె.వీరభాస్కర్, ఓర్సు జనార్దన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి సాక్షి భావ నారాయణ బ్రహ్మోత్సవాలు
పొన్నూరు: పట్టణంలోని శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మీసమేత సాక్షి శ్రీ భావనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి మే 5వ తేదీ వరకు జరుగుతాయని ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు. 23వ తేదీ రాత్రి 10 గంటలకు ధ్వజారోహణం కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. 24వ తేదీ నుంచి ప్రతి రోజు ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లకు పంచామృత స్నపన తిరుమంజన ఉత్సవం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. ధర్మకర్తల మండలి డైరెక్టర్ గున్నాథరావు, సభ్యులు కాట్రగడ్డ రామచంద్రరావు, గుడివాడ పవన్, ధరణికోట సాయికిరణ్, ఆకు రాతి అనూరాధ, ఊటుకూరి బాజీ శిరీష, సింహాద్రి రాము తదితరులు పాల్గొన్నారు.
అక్రమాలకు అండగా
టీఢీపీ
జంగా వెంకట కోటయ్య
అవయవదానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగులు
గుంటూరు మెడికల్: ఆమె మరణించినా తన అవయవాలతో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. బ్రెయిన్ డెడ్ అయిన మహిళ నుంచి గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పటల్ వైద్యులు అవయవాలు సేకరించి పలువురికి అమర్చి నూతన జీవితాలు ప్రసాదించారు. వివరాలు... బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామానికి చెందిన ఆకురాటి రత్నకుమారి (65) బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైంది. కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఈ నెల 19వ తేదీన గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పటల్‌లో అడ్మిట్ చేయించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె కోలుకోకపోవడంతో ఈ నెల 21న బ్రెయిన్ డెడ్‌గా వైద్యులు నిర్ధారించారు. రత్నకుమారి కుటుంబసభ్యులకు జీవన్‌దాన్ ట్రస్టు కో ఆర్డినేటర్లు అవయవ దానం గురించి వివరించారు. వారు కూడా దానం చేయడానికి ముందుకు వచ్చారు. లివర్, ఒక కిడ్నీని గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పటల్‌లో, విజయవాడ విజయ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న రోగికి మరో కిడ్నీ, ఎల్‌వీప్రసాద్ కంటి ఆసుపత్రికి నేత్రాలు పంపించారు. తద్వారా ఐదుగురికి నూతన జీవితాలు ప్రసాదించారు. ఈ సందర్భంగా ఆస్టర్ రమేష్ హాస్పటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్‌బాబు మాట్లాడుతూ అవయవదానం అత్యంత గొప్ప మానవ సేవ అని పేర్కొన్నారు.
7
జెడ్పీ వార్షిక బడ్జెట్‌తో సంబంధం లేకుండానే భవిష్యత్తులో చెల్లింపులు జరిపేందుకు ప్రణాళిక లేకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో రూ.44.73 కోట్ల విలువైన పనులకు చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ఏకపక్షంగా గతంలో అనుమతులు ఇచ్చేశారు. ఈ వ్యవహారానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు ప్రస్తుత సర్వసభ్య సమావేశంలోనూ అదే విధానాన్ని కొనసాగించారు. రొంపిచర్ల జెడ్పీటీసీ సభ్యుడు పిల్లి ఓబుల్‌రెడ్డి ఈ విషయమై గట్టిగా తన గళం వినిపించారు. కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులకు మించి రూ.38 కోట్ల పనులు ముందస్తుగా అనుమతులు ఇవ్వడంతో జెడ్పీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారని అన్నారు. దీనిపై తాము గత సమావేశాల్లోనూ అభ్యంతరం చెప్పామని, జెడ్పీటీసీలతో చర్చించకుండా ఏకపక్షంగా అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు. ఈ నిధులతో సంబంధం లేకుండా రూ.38 కోట్లు, గత మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి జెడ్పీ సాధారణ నిధుల నుంచి రూ.2,35,15,668 తోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ.4.38 కోట్లను కలుపుకొని రూ.44.73 కోట్ల పనులకు చైర్‌పర్సన్ ఏకపక్షంగా అనుమతులు ఇచ్చేశారన్నారు. నిధుల లభ్యత లేకుండా ఇలా చేస్తే భవిష్యత్తులో పూర్తయిన పనులకు ఏ విధంగా చెల్లింపులు జరుపుతారని ఓబుల్‌రెడ్డి ప్రశ్నించారు. దీంతోపాటు రూ.32 కోట్ల మేరకు స్టాంప్ డ్యూటీ సర్‌చార్జ్ నిధులు విడుదల చేయని టీడీపీ సర్కారు తీరుపై జెడ్పీటీసీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
రూ. 44.73 కోట్ల ముందస్తు అనుమతులకు ఆమోదం
గుంటూరు ఎడ్యుకేషన్ జెడ్పీటీసీ సభ్యుల అంగీకారం లేకుండా ముందస్తు అనుమతులు ఇచ్చేసిన పనులకు జెడ్పీ సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. నిధులు లేకుండా రూ.కోట్ల విలువైన పనులను ఇష్టారాజ్యంగా కేటాయించేస్తూ, జెడ్పీ ఖజానాకు తీవ్ర ఆర్థిక భారంగా మారిన విధానాన్ని అడ్డుకునేందుకు వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ టీడీపీ ప్రజా ప్రతినిధులు అంతా ఒక్కటై ఆమోదింప చేసుకున్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.
పిడుగురాళ్లలో జూన్ నుంచి ఓపీ సేవలు
పిడుగురాళ్ల వైద్య కళాశాలలో జూన్ నుంచి ఓపీ సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు చెప్పారు. పలువురు జెడ్పీటీసీ సభ్యులు అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందిస్తూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా నిర్మించిన మెడికల్ కళాశాలను ఇప్పుడు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఇందులో రెండు ప్రభుత్వాల సహకారం ఉందన్నారు. జూన్‌లో అకడమిక్ తరగతులు ప్రారంభం అవుతాయని చెప్పారు.
సమస్యలపై గళమెత్తిన ప్రజాప్రతినిధులు
ప్రజల ఇబ్బందులపై సభ్యుల నిలదీత
పిడుగురాళ్ల జెడ్పీటీసీ సభ్యుడు జంగా వెంకట కోటయ్య మాట్లాడుతూ గత ఐదేళ్లలో 15వ ఆర్థిక సంఘం నుంచి జెడ్పీకి వచ్చిన నిధులు, పూర్తి చేసిన పనులతోపాటు రద్దు చేసిన పనుల వివరాలు చెప్పాలని అడిగారు. దీనిపై జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు సమాధానమిస్తూ రూ.180 కోట్ల పనులు మంజూరు చేశామని, ఇప్పటి వరకు రూ.142 కోట్లు వచ్చాయని చెప్పారు. మిగిలిన రూ.38 కోట్ల పరిస్థితి ఏంటని నిలదీయడంతో పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెబుతారంటూ సమాధానం దాటవేశారు. వర్క్ ఆర్డర్ ఇచ్చి ఏడాది ముగిసినా ప్రారంభం కాని పనులను రద్దు చేయాలని చట్టంలో స్పష్టంగా ఉందని, ఆ విధంగా రద్దు చేసిన పనులకు సైతం నిధులు కేటాయించినట్లు చూపుతున్నారని కోటయ్య నిలదీశారు. అధికారులు సరైన సమాధానం చెప్పలేదు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఇరువురు జెడ్పీటీసీలను వారించారు. నిధుల విషయమై చర్చ ముగించాలని సూచించారు. మరో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా... జెడ్పీటీసీ సభ్యులను మాట్లాడనీయలేదు. దీంతో చేసేది లేక వారు మౌనం వహించారు. అజెండా ఆమోదించినట్లుగా ప్రకటించుకున్న చైర్‌పర్సన్ సమావేశాన్ని ముగించారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, పల్నాడు జేసీ సంజనా సింహ, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు, వేగెశ్న నరేంద్రవర్మ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.


