26 నుంచి నృసింహస్వామి జయంత్యుత్సవాలు | - | Sakshi
Sakshi News home page

26 నుంచి నృసింహస్వామి జయంత్యుత్సవాలు

Apr 23 2026 7:30 AM | Updated on Apr 23 2026 7:30 AM

26 నుంచి నృసింహస్వామి జయంత్యుత్సవాలు

మంగళగిరి టౌన్‌: మంగళగిరి నగరంలో వేంచేసియున్న శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంత్యుత్సవాలు ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 26 ఆదివారం నుంచి మే 1వ తేదీ వరకు స్వామివారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగనున్నాయి. 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఋత్విగ్వరణమ్‌, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురారోపణ, 27వ తేదీ ఉదయం 8 గంటలకు విష్వక్సేన, పుణ్యాహవచనం, అగ్నిప్రతిష్ట, నారసింహ మూలమంత్ర హోమం, సాయంతం 6 గంటలకు కుంభార్చన, నారసింహ హోమం, రాత్రి 7 గంటలకు శ్రీవారి గరుడ సేవ, 28వ తేదీ ఉదయం సుదర్శన నారసింహ హోమం, రాత్రి సహస్ర దీపాలంకరణ సేవ, 29వ తేదీ ఉదయం లక్ష పుష్పార్చన, రాత్రి చతుర్వేద పారాయణం 30వ తేదీ ఉదయం విశేష అలంకారం, మే 1వ తేదీ మహాపూర్ణాహుతి, శాంతి కళ్యాణం, స్వామివారి గ్రామోత్సవం తదితర కార్యక్రమాలు జరుగనున్నాయని ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement