అంబటి ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలేవీ?
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి
రాంబాబు వ్యవహారంలో తేటతెల్లం
● ఆయన ఇంటిపై దాడి చేసిన వారిపై
మాత్రం చర్యలు శూన్యం
● శాంతియుతంగా నిరసన తెలిపిన
అంబటిపై కేసు నమోదు
● రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు
పోలీసుల అత్యుత్సాహం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఈ నెల 19వ తేదీన గుంటూరులోని కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు చేపట్టిన నిరసన దీక్షపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా దీక్ష చేశారంటూ ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వంలో తన ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా దీక్ష చేపట్టిన అంబటిపై ఎస్‌ఐ ప్రసన్న కేసు నమోదు చేశారు. కానీ కూటమి నాయకులు సుమారు 7 గంటలకుపైగా అంబటి ఇంటిపై, కార్యాలయంపై చేసిన విధ్వంసకాండకు సంబంధం ఉన్న వ్యక్తులపై ఇంత వరకు పోలీస్ శాఖ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతోపాటు అంబటి రాంబాబుపై ఇద్దరు పోలీస్ అధికారుల ఉద్దేశపూర్వకంగా పోలీస్ స్టేషన్‌లో చేసిన వేధింపులపై పాల్పడినా ప్రభుత్వం పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇవే డిమాండ్లతో ఈ నెల 19వ తేదీన ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చేపట్టిన నిరహార దీక్షకు ఎలాంటి అనుమతులు లేవని, కూమటి నాయకుల ఆదేశాల మేరకు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో గోప్యంగా అంబటిపై కేసు నమోదు చేశారు.
రాంబాబు ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి అదే రోజు పోలీసులు అంబటిని అరెస్ట్ చేసి మరుసటి రోజు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అదే రోజు న్యాయమూర్తిని అంబటి తన ఇంటి పై జరిగిన దాడికి సంబంధించి ఫిర్యాదును తీసుకోవాలంటూ చేసిన అభ్యర్థన మేరకు వెస్ట్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై నామమాత్రంగా ప్రస్తుత మాజీ కార్పొరేటర్ పేరుతో మరికొందరు అంటూ కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకొన్నారు. అంబటి ఇంటిపై దాడికి పాల్పడిన వారికి టీడీపీలో కీలక పదవులను ఇచ్చి ప్రోత్సాహించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పథకం ప్రకారమే అంబటిపై దాడి చేసినట్లు పదవులు ఇవ్వడంతో స్పష్టం అవుతోంది. ఇప్పటికై నా పోలీస్ ఉన్నతాఽధికారులు, సంబంధిత అధికారులు పార్టీలకు అతీతంగా సమన్యాయంతో విధులు నిర్వహించాలన్నారు. కూటమి నాయకుల మెప్పు కోసం కేసులు బనాయించడం సరికాదని అన్నారు.


