గుంటూరు ఎడ్యుకేషన్ జేఈఈ మెయిన్స్–2026 ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రభంజనం సృష్టించారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. సోమవారం చంద్రమౌళీనగర్‌లోని భాష్యం మెయిన్ క్యాంవస్‌లో జరిగిన విద్యార్థుల అభినందన సభలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్లో జరిగిన జేఈఈ మెయి న్స్ సెషన్–2 పరీక్షలో టి.దుర్గా సుప్రభాత్ ఆంధ్రప్రదేశ్ నుంచి 100 పర్సంటైల్ సాధించి చరిత్ర సృష్టించాడని, ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 11వ ర్యాంకును కై వసం చేసుకున్నట్లు చెప్పారు. వివిధ కేటగిరీల్లో జేసీహెచ్ వర్షిత్ ఆలిండియా 5వ ర్యాంకు, డి.పవన్ 6వ ర్యాంకు, ఆర్.బాలానాయక్, 24వ ర్యాంకు, కె. రామకష్ణారెడ్డి 62వ ర్యాంకు, సీహెచ్ ప్రణయ్ 83వ ర్యాంకు, వై.యశస్వి 99వ ర్యాంకు, ఎం.బాలసాయిరామ్ 123వ ర్యాంకు, కె.కేశవకుమార్ సాయికృష్ణ 135వ ర్యాంకు, నూర్ బాషా హఫీజ్ 140వ ర్యాంకు వంటి 150లోపు 10 అత్యుత్తమ ర్యాంకులు సాధించామని చెప్పారు. ఆల్ ఇండియా 200లోపు 28 ర్యాంకులు, 500లోపు 60 ర్యాంకులు, వెయ్యి లోపు 82 ర్యాంకులు కై వసం చేసుకుని 73.24 శాతం సక్సెస్‌రేట్‌తో సత్తా చాటారన్నారు. ఇదే స్ఫూర్తితో మే నెలలో జరగబోయే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ తమ విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయానికి తోడ్పడిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపకులకు చైర్మన్‌రామకృష్ణ, భాష్యం విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్, ఐఐటి ప్రోగ్రామర్ ఎం. ఆనంద్ కుమార్ అభినందనలు తెలిపారు.


