మంగళగిరి ఎయిమ్స్‌ వైద్యురాలికి అరుదైన అవకాశం | - | Sakshi
Sakshi News home page

మంగళగిరి ఎయిమ్స్‌ వైద్యురాలికి అరుదైన అవకాశం

Apr 21 2026 4:14 AM | Updated on Apr 21 2026 4:14 AM

మంగళగిరి టౌన్‌: మంగళగిరి ఎయిమ్స్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్‌ తుమ్మలగుంట ప్రత్యూషకు అరుదైన అవకాశం లభించింది. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ క్లినికల్‌ మైక్రోబయాలజీ అండ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీసెస్‌ – (ఈఎస్‌సీఎంఐడీ) సదస్సులో భారతదేశం నుంచి ఏకై క ప్రతినిధిగా పాల్గొని కీలకోపన్యాసం చేశారు. మంగళగిరిలోని ఎయిమ్స్‌ జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్‌ ప్రత్యూష క్లినికల్‌ మైక్రోబయాలజీ, ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌పైన పరిశోధనలు చేయడంతోపాటు ఆమె రచించిన విలువైన సిద్ధాంతపత్రాలు వివిధ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. జర్మనీలోని మ్యూనిచ్‌లో ఈ నెల 17నుంచి ప్రారంభమైన సదస్సు నేటితో ముగియనుంది. క్లినికల్‌ మైక్రోబయాలజీ, అంటువ్యాధులపై ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు భారత ప్రభుత్వం నుంచి ఆమె ప్రతినిధిగా పాల్గొని అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యరంగం పరంగా చేపట్టాల్సిన పలు అంశాలపై ఆమె కీలకపన్యాసం చేశారు. ప్రతిష్ఠాత్మక సదస్సులో పాల్గొన్న డాక్టర్‌ ప్రత్యూషను ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అహెంతం శాంతాసింగ్‌, అధికారులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement