బాధితులకు చట్టప్రకారం న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

బాధితులకు చట్టప్రకారం న్యాయం చేయాలి

Apr 21 2026 4:14 AM | Updated on Apr 21 2026 4:14 AM

బాధితులకు చట్టప్రకారం న్యాయం చేయాలి

నగరంపాలెం: బాధితులకు నిర్ణీత వేళల్లో చట్ట ప్రకారం న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను జిల్లా ఎస్పీ అలకించారు. బాధితుల సమస్యలపై సంబంధిత పోలీస్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, డీఎస్పీలు అబ్దుల్‌ అజీజ్‌ (గుంటూరు తూర్పు), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్‌), బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్‌)లు అర్జీలు స్వీకరించగా, 146 ఫిర్యాదులు వచ్చాయని కార్యాలయపు వర్గాలు లె లిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement