గుంటూరు ఎడ్యుకేషన్: జేఈఈ మెయిన్స్–2026 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారని సంస్థ ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్ తెలిపారు. సోమవారం లక్ష్మీపురంలోని క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గుంటూరుజోన్ నుంచి పి.ప్రవీత్ చెన్నకేశవ్ ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 83వ ర్యాంకు సాధించాడని చెప్పారు. వివిధ కేటగిరీల వారీగా బి.ఆంజనేయులు నాయక్ 82వ ర్యాంకు, టి.చెన్నయ్య 91వ ర్యాంకు, ఎం.సాకేత్ 143వ ర్యాంకు, డి.యశ్వంత్ 596వ ర్యాంకు, ఎస్‌ఎస్ నాగలక్ష్మి 604వ ర్యాంకు, టి.ప్రేమ్‌కిషన్ 767వ ర్యాంకు, సీహెచ్ గీతామయూరి 837వ ర్యాంకు, డినేష్ కార్తీక్ నాయక్ 776వ ర్యాంకు, జె.ఆనంద్ 911వ ర్యాంకుతోపాటు వెయ్యిలోపు 12, రెండువేల లోపు 38, ఐదు వేల లోపు 72, 10వేల లోపు 175, 20వేల లోపు 210 మంది ర్యాంకులు సాధించారని వివరించారు. సంస్థ డైరెక్టర్ బొప్పన సుష్మ, ఈమని దుర్గాప్రసాద్, డీన్లు సురేష్‌బాబు, కిషోర్, కృష్ణ, చంద్రశేఖర్, ఏజీఎం ఎల్‌టీసీ శ్రీనివాస్, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు.
తెనాలిరూరల్: గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ నాయబ్ రసూల్ వివరాలు వెల్లడించారు. జనవరి 30న మండలంలోని పెదరావూరు గ్రామ శివారులో గంజాయి తాగుతున్నారన్న సమాచారంతో రూరల్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1600 గ్రాముల గంజాయిని స్వాధీనపర్చుకున్నారు. వీరిలో బాపట్ల మండలం స్టువర్టుపురానికి చెందిన వల్లాగి విజయ్, తెనాలి నాజరుపేటకు చెందిన వడ్లమూడి గోపికిరణ్, మండలంలోని జగ్గడిగుంటపాలెంకు చెందిన దేవరకొండ మనుశివశంకర్(గతంలో రెండు గంజాయి కేసుల్లో నిందితుడు), తెనాలి నందులపేట మండా వారి వీధికి చెందిన దేవిశెట్టి బసవేశ్వరరావు(గతంలో రెండు గంజాయి కేసుల్లో నిందితుడు), మారిస్‌పేటకు చెందిన షేక్ జాకీర్ హుస్సేన్ గంజాయి విక్రయిస్తున్నట్టు పోలీసులు గర్తించారు. పట్టణ చెంచుపేటకు చెందిన మైనేని రోహిత్ చౌదరి, నందులపేటకు చెందిన తుమ్మలపెంట లక్ష్మీసూర్యప్రకాష్, మారిస్‌పేట రెండు గేట్ల ప్రాంతానికి చెందిన గంపల వెంకట శివనాగమణికంఠ కొనుగోలు చేసి సేవిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అప్పట్లో వీరిని అరెస్ట్ చేయగా, ఇదే కేసులో నిందితులైన పట్టణ మారిస్‌పేట మఠం బజారుకు చెందిన షేక్ ఫిరోజ్, నందులపేటకు చెందిన కోటిసాయి మంజునాథ్ పరారీలో ఉన్నారు. వారిని సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టు తెలిపారు. గంజాయి వినియోగంపై డయల్ 100/112 ద్వారా పోలీసులకు సమా చారం ఇవ్వొచ్చని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు


