విద్యార్థులను అభినందించిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులను అభినందించిన కలెక్టర్‌

Apr 21 2026 4:14 AM | Updated on Apr 21 2026 4:14 AM

గుంటూరు వెస్ట్‌: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా ఇస్రో నిర్వహించిన యువికా యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డులకు ఎంపికై న విద్యార్థులను జిల్లా కలెక్టర్‌ సి.యం.సాయికాంత్‌ వర్మ సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో అభినందించారు. ఫిరంగిపురం మండలం వేములూరిపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి ఇర్ల జ్యోతిర్మయి, వట్టిచెరుకూరు మండలం ముట్లూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని సుస్మితా చంద్‌లు అవార్డుకు ఎంపికయ్యారు.

విద్యార్థులు జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్‌ షేక్‌ సలీంబాషాతో కలసి కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ నుండి 14 మంది విద్యార్థులు ఇస్రో యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డుకు ఎంపిక కాగా, వారిలో గుంటూరు జిల్లా నుండి ఇద్దరు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత ఉన్నత అవార్డులు అందుకోవాలని ఆకాక్షించారు. విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించిన ఉపాధ్యాయులు రామాంజనేయులు, శ్రీనివాస్‌, ముట్లూరు ప్రధానోపాధ్యాయులు జోస్‌ మేరీలను అభినందించారు. ఎంపికై న విద్యార్థులు మే 9 నుండి 23 వరకు శ్రీహరికోట షార్‌ కేంద్రంలో జరిగే యూనికా యంగ్‌ సైంటిస్ట్‌ ప్రోగ్రాంలో పాల్గొంటారని జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైనన్స్‌ అధికారి షేక్‌ గౌసుల్‌ మీరా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement