పారా వెటర్నరీ కౌన్సిల్‌ అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పారా వెటర్నరీ కౌన్సిల్‌ అమలు చేయాలి

Apr 20 2026 8:11 AM | Updated on Apr 20 2026 8:11 AM

పారా వెటర్నరీ కౌన్సిల్‌ అమలు చేయాలి

గుంటూరు మెడికల్‌: పారా వెటర్నరీ కౌన్సిల్‌కు 2023లోనే గెజిట్‌ వచ్చినా నేటికీ అమలు కాకపోవటం చాలా బాధాకరమని, పూర్తిస్థాయిలో పారా వెటర్నరీ కౌన్సిల్‌ను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గ్రాడ్యుయేట్‌ వెటర్నరీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ భూక్యా సేవానాయక్‌ కోరారు. ఆదివారం గుంటూరులోని ఏపీఎన్‌జీజీఓ కల్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గ్రాడ్యుయేట్‌ వెటర్నరీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర సర్వసభ్య సమావేశం, సంఘం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో స్వర్ణోత్సవాలు, ప్రపంచ పశువైద్య వేడుకలు నిర్వహించారు. వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి 600 మంది ఫెడరేషన్‌ సభ్యులు హాజరయ్యారు. ఫెడరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ సేవా నాయక్‌ ఆధ్వర్యంలో జరిగిన వేడకలకు ప్రధాన కార్యదర్శి బి.గోవిందరాజు, కో చైర్మన్‌ ఎన్‌. రాఘవరావు, వైస్‌ చైర్మన్‌ జి.రామకృష్ణ , ప్రసాదరావు, సీహెచ్‌ అనిల్‌, రాకేష్‌, శశిధర్‌రెడ్డి, వెంకట సుబ్బయ్య, రాష్ట్ర మాజీ చైర్మన్‌ ఎస్‌. వెంకటేశ్వర్లు, సంజీవరెడ్డి, రామారావు, ఆర్‌డీ సుబ్రహ్మణ్యం, వెంకటరాముడు, పశు సంవర్థకశాఖ సంయుక్త సంచాలకులు కేవీపీ సత్యన్నారాయణ, ఏపీఎన్‌జీజీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్‌ శ్రీనివాస్‌ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూర్‌ షరీఫ్‌ హాజరై మాట్లాడారు. సమావేశంలో పారా వెటర్నరీ కౌన్సిల్‌ పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సీనియర్‌ కేడర్‌ వీఎల్‌ఓ కేడర్‌కు గెజిటెడ్‌ హోదా ఇవ్వాలని, ఎల్‌ఎస్‌ఏ క్యాడర్‌ను వెటర్నరీ ఇన్‌స్పెక్టర్‌గా పేరు మార్పు చేయాలని కూడా వారు ఆయా డిమాండ్లపై చర్చించారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని నిర్ణయించారు.

ఫెడరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ భూక్యా సేవానాయక్‌

Advertisement
 
Advertisement
Advertisement